నాగిరెడ్డిపేట/గాంధారి(ఎల్లారెడ్డి): జిల్లాలో తాగునీటి సమస్యపై ‘సాక్షి’లో సోమవారం గ్రౌండ్ రిపోర్ట్ ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు వెళ్లి సమస్య తీవ్రతను తెలుసుకున్నారు. నాగిరెడ్డిపేట మండలకేంద్రం గోపాల్‌పేటలోని ఎస్సీ కాలనీని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రాజ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి కిష్టయ్య సందర్శించారు. కాలనీకి మిషన్ భగీరథ నీరు సరఫరా చేసే పైప్‌లైన్‌లో సమస్య ఉందని, రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామన్నారు.
గాంధారి మండలం సోమ్లానాయక్ తండాను డీపీవో మురళి, ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్, డీఎల్పీవో సురేందర్, తహసీల్దార్ సతీశ్‌రెడ్డి, ఎంపీడీవో రాజేశ్వర్ సందర్శించారు. తండా శివారులోని వ్యవసాయ బావిని పరిశీలించి తాగు నీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బోరు వేయిస్తామని అప్పటి వరకు ట్యాంకర్‌తో నీరు సరఫరా చేస్తామన్నారు. తమ సమస్యను త్వరగా పరిష్కరించాలని తండావాసులు అధికారులను కోరారు.
సోమ్లానాయక్ తండాలో సమస్యను పరిష్కరిస్తాం
కామారెడ్డి క్రైం: గాంధారి మండలం సోమ్లానాయక్ తండాలో నీటి సమస్య లేకుండా సమస్యను పరిష్కరిస్తామని మిషన్ భగీరథ ఎస్‌ఈ రాజేంద్ర కుమార్ అన్నారు. ఈమేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తండాలో 310 జనాభాకుగాను 68 నీటి కుళాయి కనెక్షన్‌లు, 20 వేల లీటర్ల సామర్ధ్యం కలిగిన మంచి నీటి ట్యాంకు ఉన్నాయని తెలిపారు. సింగిల్ ఫేజ్ మోటారు ద్వారా నీటి సరఫరా అవుతోందని, బోరు బావిలో నీరు అడుగంటి సమస్య తలెత్తిందని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.
’సాక్షి‘ గ్రౌండ్ రిపోర్ట్‌కు స్పందన
పలు గ్రామాలను
సందర్శించిన అధికారులు
నీటి సరఫరా, ఎద్దడి సమస్యలను
పరిష్కరిస్తామని హామీ
కదిలిన అధికార యంత్రాంగం
కదిలిన అధికార యంత్రాంగం