కామారెడ్డి రూరల్: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని అడిషనల్ డీఆర్‌డీవో మురళి సూచించారు. శనివారం కామారెడ్డి మండల సమాఖ్య కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కుటుంబాలు అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంద న్నారు. మహిళ శక్తి కార్యక్రమాలపై, గ్రామ, మండల సమాఖ్య ఎన్నికల విధానాన్ని వివరించారు. మండల సమాఖ్య జనరల్ బాడీ సమావేశంలో నూతన ఈసీ సభ్యులను, నూతన పదాధికారులను ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి ఎన్నికల స్పెషల్ ఆఫీసర్‌గా సదాశివనగర్ ఏపీఎం రాజారెడ్డి హాజరై ఎన్నికలు నిర్వహించారు. అనంతరం నూతన పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. సమాఖ్య అధ్యక్షురాలిగా శాబ్దిపూర్ గ్రామ సంఘానికి చెందిన ఎ గోదావరి, కార్యదర్శిగా శ్రీ ఆంజనేయ ఉగ్రవాయి గ్రామ సంఘానికి చెందిన పూజ, కోశాధికారిగా చిన్నమల్లారెడ్డి శ్రీకారం గ్రామ సంఘానికి చెందిన సరస్వతి ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికై న సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మోడల్ మండల సమాఖ్య కార్యక్రమాలపై చర్చించి అమలు చేయాల్సిన అంశాలపై తీర్మానం చేశారు. కార్యక్రమంలో ఏపీఎం మోయిజ్, సీసీలు విశ్వనాథం, అంజాగౌడ్, స్వరూపరాణి, అకౌంటెంట్ లత, కంప్యూర్ ఆపరేటర్, గ్రామ సంఘం అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.
అడిషనల్ డీఆర్‌డీవో మురళి
మండల సమాఖ్య పాలకవర్గం ఎన్నిక