
ఆందోళన చేస్తున్న లబ్ధిదారులు
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని 22వ వార్డు లో ని డ్రైవర్స్ కాలనీలో గల డబుల్ బెడ్‌రూం ఇళ్ల వద్ద లబ్ధిదారులు, బాధితులు శనివారం ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం, అధికారులు ఇళ్లకు విద్యుత్ సరఫరా, నీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇళ్ల పట్టాలతోపాటు, విద్యుత్ మీటర్ ఇప్పిస్తానని స్థానిక బీఆర్‌ఎస్ నాయకుడు ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల ద్వారా లబ్ధిదారుల నుంచి రూ. వెయ్యి చొప్పున వసూలు చేశారని బాధితులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. రెండు గంటలపాటు ఆందోళ నకు దిగారు. పోలీసులు ఘటనా స్థలానికి చే రుకు ని బాధితులను సముదాయించారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడంలేదని ఆవే దన వ్యక్తం చేశారు. డబ్బులు వ సూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సౌకర్యాలు కల్పించాలని
లబ్ధిదారుల ధర్నా
విద్యుత్ మీటర్ల కోసం డబ్బు వసూలు చేసిన బీఆర్‌ఎస్ నాయకుడు
నిలదీసిన లబ్ధిదారులు

కనెక్షన్ల కోసం పేర్లు రాసుకుంటున్న ప్రైవేట్ వ్యక్తి