
జాకోరాలో మాట్లాడుతున్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి
వర్ని: అభివృద్ధిలో నియోజకవర్గం రాష్ట్రంలో ఐదో స్థానంలో ఉందని, ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే రాష్ట్రంలో నంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని బీఆర్‌ఎస్ బాన్సువాడ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండలంలోని జాకోరా, జలాల్‌పూర్, సైదిపూర్, శంకోర గ్రామా ల్లో ఎన్నికల ప్రచారాన్ని మంగళవారం నిర్వహించారు. తొమ్మిదిన్నర ఏళ్లలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని మరోమారు తనను గెలిపించాలని ప్రజలను కోరారు. బీఆర్‌ఎస్ మేనిఫెస్టోను వివరించారు. ప్రభుత్వం ద్వారా చేపట్టిన సంక్షేమ పథకాలు అన్నింటిని అత్యధికంగా ప్రజలకు అందించానని తెలిపారు. సాగు, తాగునీరు, విద్య, వైద్యంతో పాటు ప్రధాన రంగాలకు అధిక నిధులు మంజూరు చేయించి అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచామని వెల్లడించారు. ప్రచారంలో పార్టీ మండల అధ్యక్షుడు గిరి, మేక వీర్రాజు, అల్తాఫ్, ఇసాక్, గోపాల్, వెంకట్ గౌడ్, కేంద్రం సాయిలు, కృష్ణారెడ్డి, రాంచందర్ పాల్గొన్నారు.
బాన్సువాడ బీఆర్‌ఎస్ అభ్యర్థి
పోచారం శ్రీనివాస్‌రెడ్డి