పూజలు చేస్తున్న ఎమ్మెల్సీ బండ ప్రకాశ్
భిక్కనూరు: ముదిరాజ్‌లు ఐకమత్యంతో ముందుకు సాగి, ఆర్థికాభివృద్ధి సాధించాల ని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ సూచించారు. బుధవారం ఆయన భి క్కనూరు పెద్దమ్మ ఆలయం ఉత్సవాల్లో పా ల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముదిరాజ్‌ల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందన్నారు. భిక్కనూరులో నిర్మిస్తున్న ముదిరాజ్ కల్యాణ మండపానికి రూ. 20 లక్షల అర్థిక సహాయం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, ముదిరాజ్ సంఘం మండలాధ్యక్షుడు రాములు, సర్పంచ్ తున్కి వేణు, ఎంపీటీసీ బండి చంద్రకళ, విండో చైర్మన్ గంగళ్ల భూమయ్య, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నంద రమేశ్, సీనియర్ న్యాయవాది గజ్జెల భిక్షపతి, ముదిరాజు సంఘం ప్రతినిధులు ఉప్పరి రాములు, పాల రాంచంద్రం, బోండ్ల శేఖర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన ఇంటర్ పరీక్షలు
కామారెడ్డి టౌన్: ఇంటర్ పరీక్షలు బుధవా రంతో ముగిశాయి. చివరిరోజు నిర్వహించి న ఇంటర్ సెకండియర్ పరీక్షకు 8,142 మంది విద్యార్థులు హాజరయ్యారు. 303 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం జిల్లాకేంద్రంలోని సాందీపని జూ నియర్ కళాశాల సెంటర్‌ను తనిఖీ చేశారు. ఇన్నాళ్లూ గదులను అద్దెకు తీసుకుని, హాస్టళ్ల లో ఉండి చదివినవారు పరీక్షలు ముగియడంతో స్వగ్రామాలకు పయనమయ్యారు.


