కామారెడ్డి అర్బన్: పాటలు మనిషిలో ఉత్సా హం నింపుతాయని, జాపపద సంగీతం ఇంకా అద్భుతంగా ఉంటుందని తాడ్వాయి మండలం దేవాయిపల్లికి చెందిన శాస్త్రవేత పైడి ఎల్లారెడ్డి పేర్కొన్నారు. తాడ్వాయిలో మంగళవారం హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో రచయిత కౌడి రవీందర్ రచించి రూపొందించిన పాటల సీడీని ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మాట్లాడుతూ రవీందర్‌కు మంచి భవిష్యత్తు ఉందన్నారు. తాను సినిమా పాటలు రాయాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నట్టు రవీందర్ తెలిపారు. సమావేశంలో నాగిరెడ్డిపేట జెడ్పీటీసీ మనోహర్‌రెడ్డి, ఎంపీపీ రాజ్‌దాస్, సర్పంచ్ సంజీవులు, గజల్ కవి సూరారం శంకర్, మెట్టు రవీందర్, పిచ్చయ్య, రాజు, తిమ్మరెడ్డి గోపాల్‌రెడ్డి, శ్రీనివాస్, అనుపాల అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
‘మహనీయుల జయంతి నిర్వహించాలి’
కామారెడ్డి టౌన్: మహనీయుల జయంతిని అన్ని గ్రామాల్లో నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. కలెక్టరేట్‌లో ని కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం మహనీయుల జయంతిపై సమన్వయ కమిటీ సమా వేశం నిర్వహించారు. గ్రామాలు, మున్సిపాలిటీలలో అంబేడ్కర్, జగ్జీవన్ రాం జయంతి నిర్వహించాలన్నారు. సమావేశంలో జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి వెంకటేశ్, సహాయ బీసీ అభివృద్ధి అధికారి యాదగిరి, సమన్వ య కమిటీ ప్రతినిధులు మల్లయ్య, రాజలింగం, రాజయ్య, సిద్ధిరాములు, శివరాములు, దేవులా, నరేందర్, బాలయ్య పాల్గొన్నారు.
‘పరీక్షలంటే భయం వీడాలి’
బాన్సువాడ రూరల్: విద్యార్థులు పరీక్షలంటే భయం వీడాలని డీఈవో రాజు సూచించా రు. మంగళవారం ఆయన సెక్టోరల్ అధికారి శ్రీపతితో కలిసి బోర్లం ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ఉపాధ్యాయుల సలహాలు, సూచనలు పాటించి మంచి ఫలితాలు సాధించాలని సూచించా రు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై హెచ్‌ఎం విజయ్‌కుమార్‌కు సూచనలు ఇచ్చారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.


