మహిళ మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

మహిళ మృతదేహం లభ్యం

Apr 5 2026 7:42 AM | Updated on Apr 5 2026 7:42 AM

నిడదవోలు: ఉండ్రాజవరం మండలం దమ్మెన్నులో నరసాపురం పెదకాలువలో గల్లంతైన గున్నం భార్గవీదుర్గ ప్రసన్న (26) మృతదేహం శనివారం లభ్యమైంది. తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన గున్నం భార్గవి దుర్గాప్రసన్నతో పాటు స్నేహితుడు రావుపల్లి సమీర్‌చక్రవర్తి, ఆళ్ల పవన్‌శ్రీకర్‌ తేజలు శుక్రవారం తాడేపల్లిగూడెంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలకు సర్టిఫికెట్లు తీసుకోవడానికి వచ్చారు. గుడ్‌ఫ్రైడే సెలవు కావడంతో శనివారం రావాలని అక్కడ సిబ్బంది చెప్పడంతో తణుకు పట్టణానికి వచ్చి భోజనం చేశారు. తహసీల్దార్‌ పీఎస్‌డీ ప్రసాద్‌, ఉండ్రాజవరం ఎస్సై రవికుమార్‌ సంఘటన స్థలానికి చేరుకుని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టగా కాలువరేవు సమీపాన గున్నం భార్గవి దుర్గాప్రసన్న మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై రవికుమార్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement