గూడుపుఠాణి | - | Sakshi
Sakshi News home page

గూడుపుఠాణి

Apr 7 2026 7:49 AM | Updated on Apr 7 2026 7:49 AM

పెల్లుబుకుతున్న ప్రజాగ్రహం

సీట్ల సర్దుబాటులో భాగంగా పార్టీ కోసం గత సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం సీటు త్యాగం చేసిన వర్మకు నజరానాగా సుమారు రూ.250 కోట్ల విలువైన 3.4 ఎకరాలను కేటాయిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసింది. వర్మ కుమారుడికి చెందిన కనస్ట్రక్షన్‌ కంపెనీ స్టార్‌ హోటల్‌ నిర్మాణం కోసం ప్రభుత్వం పక్కా ప్లాన్‌ వేసి అమలు చేసింది. ఇందుకోసం కాకినాడ గర్‌ల్స్‌ పాలిటెక్నిక్‌ (జీపీటీ)కి సమీపాన ఆయుష్‌ ఆస్పత్రికి ఆనుకుని ఉన్న స్థలాన్ని ధారాదత్తం చేసింది. వాస్తవానికి ఈ ఆస్పత్రికి అనుబంధంగా ఆయుష్‌ కాలేజీ నిర్మాణానికి కేంద్రం అనుమతి కూడా ఇచ్చింది. కాకినాడలో ఆయుష్‌ ఆస్పత్రికి ఆనుకుని నిర్మించాలనుకున్న ప్రతిపాదిత కాలేజీని పిఠాపురం తరలించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోందని మేధావులు మండిపడుతున్నారు.

ఎక్కడైనా ఆస్పత్రికి దగ్గర్లోనే కాలేజీని కూడా ఏర్పాటు చేయడం అన్ని విధాలా సౌలభ్యంగా ఉంటుంది. ఇదే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించి కాలేజీ మంజూరు చేసిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. అటువంటి కాలేజీని కాకినాడ నుంచి పిఠాపురం తరలించే ఎత్తుగడలపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. ఆస్పత్రి వద్దనే కాలేజీ ఏర్పాటుకు మోకాలడ్డుతూ మాజీ ఎమ్మెల్యే వర్మ కుటుంబ సభ్యులకు అయాచిత లబ్ధి చేకూర్చడం కోసం ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందంటున్నారు.

పేదల ఇళ్ల స్థలాల్లో కాలేజీ నిర్మాణానికి స్కెచ్‌

245 కుటుంబాలను రోడ్డు పాల్జేసే కుట్ర

వర్మకు కట్టబెట్టడమే అసలు మర్మం

విస్తుబోతున్న జనం, లబ్ధిదారులు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: చంద్రబాబు ప్రభుత్వం పేదల సొత్తును పెద్దోళ్లకు దోచిపెడుతోంది. సెంటు భూమి లేని నిరుపేదలకు గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఉదారంగా ఇళ్ల స్థలాలు అందించింది. ఇళ్ల పట్టాలు ఇచ్చి, స్థలాలు చూపించింది. ఇళ్లు నిర్మించుకోలేదనే సాకుతో చంద్రబాబు ప్రభుత్వం కనీస కనికరం లేకుండా ఆ స్థలాలను లాగేసుకుంటోంది.

ఇందుకోసం ప్రత్యేక జీఓను విడుదల చేయడం విస్మయానికి గురిచేస్తోంది. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా నిరుపేదల ఇళ్లు నిర్మించుకోలేని దీనావస్థను ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించి ఇళ్ల నిర్మాణానికి తోడ్పాటు అందించాల్సింది పోయి అన్యాయంగా స్థలాలు వెనక్కు తీసేసుకునేలా ఇచ్చిన జీఓపై బాధితులు నిప్పులు చెరుగుతున్నారు. ఇదంతా తెలుగుదేశం పార్టీకి చెందిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ వర్మ కుటుంబ సభ్యులకు అయాచిత లబ్థి చేకూర్చేందుకనే తెలిసి జనం ఆశ్చర్యపోతున్నారు. నిస్సిగ్గుగా నిరుపేదల గూడు కోసం కేటాయించిన ఇళ్ల స్థలాలను బలవంతంగా తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నాలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.

స్థలాలు వెనక్కు తీసేసుకుంటే ఏమైపోతాం

ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారు. స్థలాలు కూడా చూపించారు. ఇళ్లు నిర్మించుకునే సమయంలో ఎన్నికలు రావడంతో అవి ఆగిపోయాయి. స్థలాలు మాత్రం అలా గే ఉన్నాయి. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఇళ్లు నిర్మిస్తామని నాయకులు చెప్పడంతో ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాం. చాలామంది నాయకులు, అధికారులను కలిశాం. త్వరలో ఇళ్ల నిర్మా ణం చేపడతాం అని చెప్పారు. తీరా ఇప్పుడు స్థలాలు వెనక్కు ఇచ్చేయాలని ప్రభుత్వం చెబుతుంటే ఏమి చేయాలో అర్థం కావడం లేదు. మాదిరాజు శ్రీదేవి,

నూకాలమ్మ గుడివీధి, పిఠాపురం.

అన్యాయం

చేయడం తగునా?

ఎన్నో ఆశలతో ఇల్లు కట్టుకోవచ్చునుకుంటున్నాం. ప్రభుత్వం అకస్మాత్తుగా స్థలాలు వెనక్కు తీసేసుకుంటే రోడ్డు పాలైపోతాం. ఇల్లు నిర్మిస్తారనుకుంటే ఇప్పుడు ఇలా చేయడం తగునా. స్థలాలు ఉన్నాయి, ఈ వేళ కాక పోతే రేపు కట్టుకుందామనుకుంటే నాయకులు వచ్చి మీకు ఇల్లు కట్టిస్తామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇల్లు కట్టివ్వాలి.

– పొట్నూరి లోవలక్ష్మి,

గొల్లపేట, పిఠాపురం

ఇళ్లు కట్టించడానికి బదులు స్థలాలకు ఎసరు

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో ఇటువంటి దుర్మార్గమైన జీఓ విడుదల చేయడంపై వైఎస్సార్‌ సీపీ, వామపక్షాలతో సహా ప్రజా సంఘాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. పిఠాపురంలోని మసీదు మాన్యం భూముల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు సిద్ధమవుతోన్న నిరుపేదలైన సుమారు 245 కుటుంబాల వారిని రోడ్డు పాల్జేస్తున్న సర్కార్‌ తీరుపై బాధితులు నిప్పులు చెరుగుతున్నారు. మూడేళ్ల క్రితం వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం సుమారు ఐదు ఎకరాలలో ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. ఇళ్ల నిర్మాణాలకు సమాయత్తమవుతోన్న తరుణంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. తాము అధికారంలోకి వస్తే ఇళ్ల స్థలాలు ఇచ్చిన భూముల్లో ఇళ్లు కట్టించి ఇస్తామని కూటమి నేతలు గత సార్వత్రిక ఎన్నికల్లో హామీ ఇచ్చారు. తీరా గద్దెనెక్కి రెండేళ్‌లైనా నిర్మాణాల ఊసే మరచిపోయారు. అప్పటి నుంచి లబ్ధిదారులు ఇళ్ల మంజూరు చేసి నిర్మించాలని ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వారికి ఇళ్లు మంజూరు చేయకుండా, ఉన్న స్థలాలు వెనక్కి తీసుకుని ఆయుష్‌ కళాశాల నిర్మించాలనే ప్రయత్నాలపై బాధిత లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. బాధితుల పక్షాన మాజీ ఎంపీ, వైఎస్సార్‌ సీపీ కోఆర్డినేటర్‌ వంగా గీత పోరాటానికి శ్రీకారం చుట్టారు. సోమవారం మసీదు మాన్యంలో లబ్ధిదారులతో సమావేశం అయిన ఆమె బాధితులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి పాడా కార్యాలయంలో పీడీకి వినతిపత్రం అందజేశారు. ఇదే విషయమై సీపీఐ నేతలు ఇప్పటికే ఆందోళనకు ఉపక్రమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement