రైళ్లలో చోరీ.. నిందితుల అరెస్ట్
తుని: రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేసినట్లు స్థానిక జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కాకినాడ లైన్ ఇన్‌స్పెక్టర్ టి.శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది అన్నవరం రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టారు. మూడో నంబర్ ప్లాట్‌ఫారంపై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుంచి 26 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 900 నగదు వెరసి రూ.3.30 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు విశాఖపట్నానికి చెందిన మైలుపిల్లి లోకేష్, బొట్ట ఆకాష్‌లుగా గుర్తించారు. వారిని పట్టుకున్న ఆర్పీహెచ్‌సీ పి.శ్రీనివాసరావు, శ్యామ్‌త్రినాథ్, డి.సూర్యప్రకాశరావు, ఆర్‌పీఎఫ్ ఎస్సై సతీష్, సామర్లకోట, అనకాపల్లి ఆర్పీఎఫ్ సిబ్బంది అశోక్‌కుమార్, రాంప్రసాద్‌లను ఉన్నతాధికారులు అభినందించారు.


