
అమ్మ అనుగ్రహానికి పాత్రులవుదాం
కాకినాడ రూరల్: అమ్మవారికి అందరూ చేసిన దీక్షను సమర్పించి ఆమె ఆనుగ్రహానికి పాత్రులవుదామని, విజయ దశమి అందరి కుంటుంబాలలో సుఖ, సంతోషాలు, ఆయురారోగ్యాలు నింపాలని శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి భక్తులకు ఆశీర్వచనాలు ఇచ్చారు. మహాశక్తి యాగంలో భాగంగా 10వ రోజు బుధవారం శ్రీపీఠంలో లక్ష కుంకుమార్చనలు వంద కోట్లపై బడి కొనసాగించారు. ఐశ్వర్యాంబిక అమ్మవారు మహాలక్ష్మిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీసూక్త, మహాలక్ష్మి హోమం నిర్వహించారు. సాయంత్రం భక్తులు తీసుకువచ్చిన పండ్లను నివేదించారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ మహాశక్తి యాగం గురువారం పూర్ణాహుతితో ముగుస్తుందన్నారు. అమ్మవారికి మూల మంత్ర సంపుటితో ఒక్కసారి పారాయణం చేసుకుందామన్నారు. శుక్రవారం సాయంత్రం శ్రీవేంకటేశ్వరుడి అలంకరణలో ఐశ్వర్యాంబిక అమ్మవారు దర్శనమిస్తారని అన్నారు. అమ్మ అనుగ్రహం ఎవరికి ఎప్పుడు ఎలా లభిస్తుందో తెలియదన్నారు. మంగళవారం రాత్రి బగళాముఖి హోమంలో అమ్మవారు బిడ్డలను లాలిస్తూ దర్శనమిచ్చారన్నారు. పూర్ణాహుతి కోసం ప్రతి ఒక్కరూ మూడు బూరెలను చిన్న సైజులో తీసుకురావాలని కోరారు. రెండు నెలలు మహాశక్తి యాగం విజయవంతానికి ఏర్పాట్లు చేసిన వారందరికి ధన్యవాదాలు తెలియజేశారు.
శ్రీ పీఠంలో నేటితో ముగియనున్న
మహాశక్తి యాగం, కుంకుమార్చనలు
10వ రోజు మహాలక్ష్మి దేవి అలంకరణలో ఐశ్వర్యాంబిక అమ్మవారు

అమ్మ అనుగ్రహానికి పాత్రులవుదాం

అమ్మ అనుగ్రహానికి పాత్రులవుదాం