
మహా సంకల్పం.. పరిపూర్ణం
కాకినాడ రూరల్: దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని కాకినాడ శ్రీపీఠంలో నిర్వహిస్తున్న మహాశక్తి యాగంలో భాగంగా వంద కోట్ల కుంకుమార్చనలు మంగళవారం పూర్తయ్యాయి. పీఠంలో సెప్టెంబర్ 22 నుంచి లలితా నహస్ర నామాలు పఠిస్తూ వేలాదిగా మహిళలు పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ఆధ్వర్యాన కుంకుమార్చనలు నిర్వహించారు. వరుసగా మూడో సంవత్సరం వంద కోట్ల కుంకుమార్చనలు పూర్తి చేశామని, మూడేళ్లలో మూడు వందల కోట్ల కుంకుమార్చనలు చేశామని ఈ సందర్భంగా స్వామీజీ తెలిపారు. వెయ్యి కోట్ల కుంకుమార్చనలు లక్ష్యంగా శ్రీపీఠంలో మహాశక్తి యాగం కొనసాగిస్తున్నామని ప్రకటించారు. అష్టమి మంగళవారం రావడంతో దీనిని మంగళాష్టమి, జయ అష్టమి అని పిలుస్తామని చెప్పారు. అష్టమి తిథి నాడు అమ్మవారిని పూజిస్తే గొప్ప ఫలితం ఉంటుందని అన్నారు. శ్రీకృష్ణుడు అష్టమి తిథినాడు పుట్టడంతో కష్టాలు అనుభవించాడని, కానీ అమ్మవారు ఆయనకు కష్టాలను భరించే శక్తిని ఇచ్చారని చెప్పారు. అమ్మను అందరూ ఆరాధించాలని, ఈ క్రమంలో మనం ఒకరి కీడు కోరుకోకూడదని హితవు పలికారు. శ్రీపీఠంలో ఐశ్వర్యాంబిక అమ్మవారు బగళాముఖిగా భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం దేవీ కవచం, బగళాముఖి హోమం నిర్వహించారు. వేలాదిగా తరలిచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా అన్న ప్రసాదం అందించారు.
ఫ మహాశక్తి యాగంలో
వంద కోట్ల కుంకుమార్చనలు పూర్తి
ఫ వేలాదిగా పాల్గొన్న మహిళలు

మహా సంకల్పం.. పరిపూర్ణం