
ప్రాణాలు తీసిన బాణసంచా
● భార్యాభర్తల మృత్యువాత
● విలస గ్రామంలో విషాద ఛాయలు
అయినవిల్లి: దీపావళి పండగకు కిరాణా సామగ్రితో పాటు బాణసంచా అమ్ముకుని నాలుగు రూపాయలు వెనుక వేసుకుందామనే ఆశ ఆ భార్యాభర్తలను బలిగొంది. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కోనసీమ జిల్లాలోని అయినవిల్లి మండలం విలస గ్రామంలో బాణసంచా పేలి కంచర్ల శ్రీనివాసరావు (51). అతని భార్య సీతామహా లక్ష్మి(46) మృత్యువాత పడ్డారు. కిరాణా షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న ఆ దంపతులు గతేడాది దీపావళికి అమ్మగా మిగిలిన బాణసంచా సామగ్రిని ఇంటి అటక పై నుంచి తీసి శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికి వారి ఇంటిపై శ్లాబు, ప్రహరీ కూలింది. పక్కనున్న ఇల్లు కూడా దెబ్బతింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలు అక్కడికక్కడే మృత్యు ఒడికి చేరారు. వారి కుమారుడు ప్రదీప్ గాయపడ్డాడు. అతనిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అమలాపురం ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలిని ఎస్పీ రాహుల్ మీనా, డీఎస్పీ సుంకర మురళీకృష్ణ, సీఐ ఆర్. భీమరాజు, ఎస్‌ఐ హరికోటి శాస్త్రి పరిళీలించారు. శిథిలాల కింద చిక్కుకున్న భార్యాభర్తల మృతదేహాలను అంబులెన్స్‌లో అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయినవిల్లి ఎస్సై హరికోటిశాస్త్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతుల కుటుంబాలను
ఆదుకోవాలని కోవాలి
మృతుల కుటుంబాలను ఆదుకోవాలని పి.గన్నవరం నియోజక వర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
లైసెన్సు కలిగిన గోడౌన్స్‌లోనే
బాణసంచా భద్రపరచాలి: ఎస్పీ
బాణసంచా సామగ్రి లైసెన్సు పొందిన గోడౌన్స్‌లోనే భద్రపరచాలని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా సూచించారు. లైసెన్సు లేకుండా బాణసంచా సామాగ్రి నిలువ ఉంచడం, తయారు చేయడం నేరమన్నారు. జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సూచించారు. లైసెన్స్ లేకుండా ఇలా బాణసంచా నిలువ ఉంచితే ఇటువంటి ప్రమాదాలే ముంచుకొస్తాయని ఆయన హెచ్చరించారు.
శిథిలాల
మధ్య ఉన్న
కంచర్ల
శ్రీనివాసరావు
మృతదేహాన్ని
బయటకు తీసి
అంబులెన్స్‌లోకి
ఎక్కిస్తున్న
పోలీసులు,
స్థానికులు
పేలుడు శబ్దానికి కూలిన ఇంటి శ్లాబు, ప్రహరీ
ప్రమాద స్థలంలో గుమిగూడిన గ్రామస్తులు

ప్రాణాలు తీసిన బాణసంచా

ప్రాణాలు తీసిన బాణసంచా

ప్రాణాలు తీసిన బాణసంచా