గొల్లప్రోలు మండలం దుర్గాడ శివాలయంలో శ్రీ లలితా దేవికి, గర్భాలయంలో సూర్యదేవునికి, ఉమాదేవి అమ్మవార్లకు, లక్ష్మీనారాయణులకు, గణపతికి, పరమేశ్వరునికి మంగళవారం ఏకకాలంలో అష్టోత్తర కలశాభిషేకం వైభవంగా నిర్వహించారు. అర్చకులు చెరుకూరి వీరబాబు, దత్తు సోదరులు మహాగణపతి పూజ, పుణ్యాహవాచనం, మహన్యాస పారాయణ, 27 ద్రవ్యాలతో, 27 కలశాలతో అభిషేకాలు చేశారు. అమ్మవారికి 108 రకాల పిండి వంటలతో మహాభోగ నివేదన చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
– పిఠాపురం
దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలను పురస్కరించుకుని, గొల్లప్రోలు మండలం తాటిపర్తి అపర్ణాదేవి ఆలయంలో అమ్మవారిని పసుపు కొమ్ముల మాలలతో మంగళవారం మంగళప్రదంగా అలంకరించారు. సమస్త మంగళాలను ప్రసాదించే అమ్మవారు మహాగౌరీదేవిగా దర్శనమిచ్చారు. అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
– పిఠాపురం
మహానైవేద్యం సమర్పయామి