
దండెత్తిన దళితులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైద్య విద్యను ప్రైవేటీకరిస్తున్న కూటమి సర్కార్‌పై దళితులు దండెత్తారు. పేద, మధ్య తరగతి, ఎస్సీ విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే చంద్రబాబు విధానాలకు వ్యతిరేకంగా కాకినాడలో సోమవారం నిరసన తెలిపారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు జిల్లా ఎస్సీ సెల్ ఆధ్వర్యాన ఈ ఆందోళన నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచీ పెద్ద ఎత్తున తరలి వచ్చిన నేతలు, కార్యకర్తలు ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు శెట్టిబత్తుల కుమార్‌రాజా ఆధ్వర్యాన కదం తొక్కుతూ ఇంద్రపాలెం అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ప్రత్తిపాడు, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల్లోని వివిధ మండలాల నుంచి నేతలు సామర్లకోట మీదుగా కాకినాడ చేరుకున్నారు. తుని, పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ నియోజకవర్గాల నుంచి పిఠాపురం, కాకినాడ భానుగుడి సెంటర్ రోడ్డు మీదుగా కాకినాడ ఇంద్రపాలెం అంబేడ్కర్ సెంటర్‌కు ర్యాలీగా తరలివచ్చారు. కూటమి సర్కారు తీరును తీవ్ర స్వరంతో ఎండగట్టారు.
తక్షణమే నిలిపివేయాలి
వైద్య విద్యను సొంత వారికి పప్పుబెల్లాల మాదిరిగా ఇచ్చే ఉద్దేశంతోనే కూటమి సర్కారు ప్రైవేటీకరణ జపం చేస్తోందని నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు. చంద్రబాబు సర్కార్ డౌన్ డౌన్, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తక్షణం నిలిపివేయాలి, పేదలకు ప్రభుత్వ వైద్య విద్యను దూరం చేసే కుట్రలను తిప్పికొడతాం, ప్రైవేటీకరణ జీఓను ఉపసంహరించుకోవాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఎస్సీలు, పేదలకు వైద్య విద్యను దూరం చేస్తున్న చంద్రబాబునాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలంటూ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులు, ప్రజలనుద్దేశించి నేతలు ప్రసంగించారు. కార్యక్రమంలో పార్టీ ఎస్సీ సెల్ నియోజకవర్గాల అధ్యక్షులు లంకా కృపానందం, గుడాల వెంకటరత్నం, బూలా అబ్బులు, బంగారు కృష్ణ, బళ్ల సూరిబాబు, పెదపాటి రమేష్ కుమార్, పార్టీ ఉపాధ్యక్షుడు చిల్లి దేవరాజు, రాష్ట్ర కార్యదర్శులు శెట్టిబత్తుల సురేష్ కుమార్, రామప్రసాద్, అప్పలరాజు, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బత్తుల భీమారావు, ఎస్సీ సెల్ మండల, గ్రామ నేతలు, అనుబంధ విభాగా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఉపసంహరించేంత వరకూ ఉద్యమం
వైద్య విద్యను ప్రైవేటీకరించే జీఓను ఉపసంహరించుకునేంత వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. పేద కుటుంబాలపై చంద్రబాబు ఎందుకంత కక్ష కట్టారో అర్థం కావడం లేదు. ఇప్పుడు 33 ఏళ్లు లీజు అంటున్న కూటమి పాలకులు కొన్ని రోజులు గడిచాక 99 ఏళ్లు లీజులంటారు. పేద, దళిత కుటుంబాల్లో పిల్లలకు వైద్య విద్య అందకూడదనే కుట్రతోనే ప్రభుత్వ రంగంలో నిర్మిస్తున్న వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తున్నారు. మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో మంజూరయ్యేవంటున్నారు. అలాంటప్పుడు చంద్రబాబు సీఎంగా పని చేసిన అన్ని సంవత్సరాల్లో ఒక్క వైద్య కళాశాలైనా తీసుకువచ్చారా?
– శెట్టిబత్తుల కుమార్‌రాజా,
వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు
ఫ ప్రభుత్వ వైద్య కళాశాలల
ప్రైవేటీకరణపై ఆగ్రహం
ఫ వైఎస్సార్ సీపీ
ఎస్సీ సెల్ ఆధ్వర్యాన నిరసన
ఫ జీఓ ఉపసంహరించాలని డిమాండ్
ఫ లేకుంటే ఉద్యమం ఉధృతం
చేస్తామని హెచ్చరిక
‘బాబు’ దివాళాకోరుతనానికి నిదర్శనం
వైద్య విద్యను పేదలకు, దళితులకు అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టడం దేశంలోనే ఒక చరిత్ర. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ రంగంలో ఐదు మెడికల్ కాలేజీలను తీసుకువచ్చి, వైద్య విద్యను పేదల దరి చేర్చారు. అటువంటి నాయకుడి వారసుడిగా జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో ఏకకాలంలో ఏకంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారు. సుదీర్ఘ కాలం సీఎంగా చేశానని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా తీసుకురాగలిగారా? అటువంటిది సొంత వారికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో దాదాపు 80 శాతం నిర్మాణం పూర్తయిన కాలేజీలను ప్రైవేటుపరం చేయాలనుకోవడం చంద్రబాబు దివాళాకోరుతనానికి నిదర్శనం. ప్రైవేటీకరణపై చినబాబు, పెదబాబు మనసు మార్చుకోవాలి. ప్రైవేటీకరణపై కూటమి వెనక్కు తగ్గేంత వరకూ ఉద్యమం మరింత ఉధృతంగా కొనసాగుతుంది. – అంగూరి లక్ష్మీశివకుమారి, మాజీ ఎమ్మెల్సీ
చంద్రబాబు దళిత వ్యతిరేకి
జగన్ దళితుల పక్షపాతిగా నిలిచిపోతే.. చంద్రబాబు దళితుల వ్యతిరేకిగా ఉన్నారు. ఇంగ్లిషు విద్యను పేదలు, దళితులకు చంద్రబాబు దూరం చేయాలనుకుంటే.. వాటిని ఆ వర్గాలకు జగన్ మరింత దగ్గర చేశారు. వైద్య విద్యను పేదలకు దూరం చేయాలనే కుట్రలతోనే చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణకు సిద్ధమైంది.
– గుల్లా ఏడుకొండలు,
వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి

దండెత్తిన దళితులు

దండెత్తిన దళితులు

దండెత్తిన దళితులు