
శ్రీ దుర్గాదేవిగా మాణిక్యాంబ
రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయంలో దసరా మహోత్సవాల్లో భాగంగా 9వ రోజు మంగళవారం మాణిక్యాంబా అమ్మవారి మట్టి ప్రతిమకు శ్రీ దుర్గాదేవి అలంకరణ చేశారు.
సరస్వతీదేవి, ఐశ్వర్యలక్ష్మిగా..
అయినవిల్లి: మండలంలోని నల్లచెరువు గ్రామంలో కొలువైన శ్రీ పద్మావతి, గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పద్మావతి అమ్మవారు మంగళవారం సరస్వతీదేవి, ఐశర్యలక్ష్మీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ వేద పండితులు ఉదయం అమ్మవారిని పెన్నులతో సరస్వతీదేవిగా అలంకరించారు. మధ్యాహ్నం అమ్మవారిని రూ.10లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఈ అలంకరణకు రూ.200, రూ.100, రూ.50, రూ.10 నోట్లను ఉపయోగించారు.
నోట్ల పెళపెళ.. లక్ష్మీ కళకళ!
పిఠాపురం: మండలంలోని రాపర్తిలో వేంచేసియున్న దుర్గా మల్లేశ్వరి అమ్మవారిని రూ.15 లక్షల కరెన్సీ నోట్లతో ధనలక్ష్మిగా అలంకరించారు.

శ్రీ దుర్గాదేవిగా మాణిక్యాంబ

శ్రీ దుర్గాదేవిగా మాణిక్యాంబ

శ్రీ దుర్గాదేవిగా మాణిక్యాంబ

శ్రీ దుర్గాదేవిగా మాణిక్యాంబ