
డీఎస్సీలో విజయం సాధించిన హాకీ క్రీడాకారులు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): డీఎస్సీ–2025లో కాకినాడ జిల్లా క్రీడామైదానంలో హాకీ కోర్టులో కోచ్ రవిరాజు వద్ద తర్ఫీదు పొందుతున్న నలుగురు క్రీడాకారిణులు పీఈటీలుగా ఉద్యోగాలు సాధించారు. జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన జి.వరలక్ష్మి, డీఎస్ సింధు దేవి, ఎస్.పరంజ్యోతి, కె.భారతి ఉద్యోగాలు సాధించిన వారిలో ఉన్నారు. వీరు అనేకసార్లు రాష్ట్ర చాంపియన్‌షిప్ సాధించిన జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఉద్యోగాలు సాధించిన క్రీడాకారిణులను, తర్ఫీదునిచ్చిన కోచ్ రవిరాజును డీఎస్‌డీఓ బి.శ్రీనివాస్‌కుమార్ మంగళవారం డీఎస్‌ఏలో జరిగిన కార్యక్రమంలో అభినందించారు.