నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఖోఖో సంఘ అధ్యక్షుడిగా సీనియర్ పీడీ కె.పట్టాభిరామ్ ఎన్నికయ్యారు. సోమవా రం కాకినాడలోని కుడుపూడి రామ్‌కుమార్ క్రీడాభవన్‌లో జిల్లా ఖోఖో సంఘ ఎన్నికలు రాష్ట్ర ఖోఖో సంఘ అధ్యక్షుడు టీఎస్‌ఆర్‌కే ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ ఎన్నికలకు జిల్లా ఒలింపిక్ సంఘ నుంచి వి.రవిరాజు, డీఎస్‌ఏ పరిశీలకులుగా పాపారావు హాజరయ్యారు. అలాగే ఎన్నికల పరిశీలకుడిగా అడ్వకేట్ ఎం.సత్యనారాయణ వ్యవహరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి అధ్యక్షుడిగా కె.పట్టాభిరామ్, కార్యదర్శిగా ఎం.శ్రీనివాస్ కుమార్, కోశాధికారిగా కె.రాంబాబు, ఉపాధ్యక్షులుగా ఎల్.గోవిందరాజులు, కె.శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శులుగా మాచరరావు, ఎండీ ఇబ్రహీం, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లుగా పి.సూర్యనారాయణ, డి.సుధాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులు టీవీఎస్ రంగారావు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు శ్రీనివాస్, కోశాధికారి నాగు, చీఫ్ టెక్నికల్ అడ్వయిజర్ సాయిప్రసాద్, బంగార్రాజులు ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించి మరోసారి ఖోఖో సంఘ ఐక్యతను చాటి చెప్పారని కొనియాడారు. ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో పోస్టులు సాధించిన ఖోఖో క్రీడాకారులు వై.జగదీష్, బి.ఆదినారాయణ, వై.సతీష్‌లను సంఘ సభ్యులు అభినందించారు.