
పెరిక సంఘం పటిష్టతకు కృషి
ప్రత్తిపాడు: గ్రామ స్థాయి నుంచీ సంఘం పటిష్టతకు సామాజిక వర్గీయులు కృషి చేయాలని రాష్ట్ర పెరిక (పురగిరి క్షత్రియ) సంఘం అధ్యక్షుడు కత్తిక రాఘవరావు పిలుపునిచ్చారు. సంఘం జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రత్తిపాడులో ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాఘవరావు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా పెరిక సామాజిక వర్గీయులున్న గ్రామాల్లో కనీసం రూ.లక్ష నిధితో పెరిక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని అన్నారు. దీని ద్వారా తమ వర్గీయుల పేద పిల్లలకు చదువు చెప్పించడం వంటి సామాజిక సేవలు చేపట్టాలని సూచించారు. అమరావతిలో రూ.2.5 కోట్లతో సామాజిక భవనం నిర్మించనున్నామన్నారు. కాకినాడలో కూడా ఇప్పటికే అరెకరం కొనుగోలు చేశామన్నారు. కాకినాడలో కమ్యూనిటీ హాలు, అన్నవరంలో కాటేజీ నిర్మాణానికి కృషి చేస్తున్నామని రాఘవరావు తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి వీరలంక సూరిబాబు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు సోము మధు, విశాఖ, అనకాపల్లి, పశ్చిమ గోదావరి జిల్లాల నాయకులు పాల్గొన్నారు.
అధ్యక్షుడిగా బద్రి
పెరిక (పురగిరి క్షత్రియ) సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా కాకినాడకు చెందిన వనపర్తి వీరభద్రరావు (బద్రి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షులుగా పోకల అప్పలరాజు (యల్లమిల్లి), ధనేకుల వీరభద్రరావు (సిరిపురం), కార్యదర్శిగా జి.సత్యనారాయణ (తుని), కోశాధికారిగా గోడే మాణిక్యాలరావు (చిల్లంగి), సభ్యులుగా వనపర్తి సతీష్, మదినే దొరబాబు, చిలకమర్తి వీరభద్రం, చిలకమర్తి నల్లబాబుతో పాటు 70 మంది సభ్యులతో నూతన కార్యవర్గం ఏర్పాటైంది. వారితో రాఘవరావు ప్రమాణ స్వీకారం చేయించారు.

పెరిక సంఘం పటిష్టతకు కృషి