ఏలేశ్వరం: పురమిత్ర యాప్‌తో మరిన్ని సేవలు అందిస్తామని మున్సిపల్ రీజనల్ డైరెక్టర్(ఆర్డీ) నాగనరసింహరావు అన్నారు. స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో బుధవారం జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీల కమిషనర్లు, మేనేజర్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు పురమిత్ర యాప్ ప్రారంభిస్తామన్నారు. దీని ద్వారా ఫిర్యాదు చేస్తే ఆ శాఖకు సమాచారం వెళుతుందన్నారు. దీంతో పాటు పన్నులు చెల్లించవచ్చన్నారు. తడిపొడి చెత్తల సేకరణపై ప్రజల్లో విస్త్రతంగా ప్రచారం చేశారు. వేసవికి తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కుక్కల నివారణలో భాగంగా వాటి శస్త్రచికిత్సలకు తునిలో కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీలో 63శాతం పన్నులు వసూలు చేశామన్నారు. కమిషనర్ ఎం సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రశాంతంగా హిందీ పరీక్ష
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా రెండవ రోజు బుధవారం హిందీ పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 27,394 దరఖాస్తు చేసుకోగా 27,186మంది హాజరుకాగా 208మంది గైర్హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారి 6 కేంద్రాలు, పరిశీలకులు 8 కేంద్రాలు, తనిఖీ అధికారులు 40 కేంద్రాలు తనిఖీ చేశారని డీఈఓ రమేష్ తెలిపారు.