ప్రాజెక్ట్‌.. పర్‌ఫెక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రాజెక్ట్‌.. పర్‌ఫెక్ట్‌

Mar 9 2025 12:15 AM | Updated on Mar 9 2025 12:15 AM

ప్రాజెక్ట్‌.. పర్‌ఫెక్ట్‌

ప్రాజెక్ట్‌.. పర్‌ఫెక్ట్‌

ఇన్‌స్పైర్‌ మనక్‌లో సత్తా చాటిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు

ఉత్తమ ప్రాజెక్టులుగా 305 ఎంపిక

ఎంపికై న ప్రాజెక్టుకు రూ.10 వేల కేటాయింపు

మెరుగులు దిద్దుకునేందుకు అవకాశం

రాయవరం: వినూత్న ఆలోచనలతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విద్యార్థులు సైన్స్‌ ప్రయోగాల్లో దూసుకుపోతున్నారు. సరికొత్త ఆలోచనలతో తమ మెదళ్లకు పదును పెడుతూ నూతన ఆవిష్కరణలకు జీవం పోస్తున్నారు. విద్యార్థుల్లో సైన్స్‌పై అభిరుచి, ఆసక్తి కలిగేలా ఉపాధ్యాయులు బోధన చేస్తుంటే, దానికి అనుగుణంగా విద్యార్థులు కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏటా ఇన్‌స్పైర్‌ మనక్‌ పురస్కారాలతో విద్యార్థులను ప్రోత్సహిస్తోంది. 2024–25 విద్యా సంవత్సరంలో మనక్‌ నామినేషన్లకు అవకాశం కల్పించింది. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 3,200 నామినేషన్లు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. వాటిలో ఉత్తమ ప్రాజెక్టులుగా 305 నామినేషన్లు ఎంపికయ్యాయి. వీటిలో కోనసీమ జిల్లా నుంచి 85, తూర్పుగోదావరి జిల్లా నుంచి 100, కాకినాడ జిల్లా నుంచి 120 నుంచి ఉన్నాయి.

ప్రాజెక్టులకు ప్రోత్సాహకం : డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫెడరేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఇన్‌స్పైర్‌ మనక్‌ 2024–25 పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి 305 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. గతేడాది 397 ప్రాజెక్టులు జిల్లా స్థాయిలో ఎంపిక కాగా, ఉమ్మడి జిల్లా నుంచి 27 ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం గమనార్హం. జాతీయ స్థాయికి మూడు జిల్లాల నుంచి మూడు ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఇదిలా ఉంటే జిల్లా స్థాయికి ఎంపికై న 305 ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10 వేల వంతున ప్రతి ప్రాజెక్టుకు ప్రోత్సాహకం అందజేయనున్నారు. సైన్స్‌ సాంకేతిక రంగాలపై విద్యార్థులకు ఆసక్తి పెంచేలా కేంద్ర ప్రభుత్వం ఈ పోటీలను నిర్వహిస్తోంది. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులను వీటిలో భాగస్వాములను చేశారు. ప్రాథమికోన్నత పాఠశాల నుంచి మూడు, ఉన్నత పాఠశాల నుంచి ఐదు వంతున నామినేషన్లను పంపించారు. పర్యావరణ పరిరక్షణ, అధునాతన వ్యవసాయ విధానాలు, హెల్త్‌ న్యూట్రిషన్‌ వంటి అంశాలపై నూతన ఆవిష్కరణలు రూపొందించారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా నుంచి జాతీయ స్థాయికి ఎంపికై న ప్రాజెక్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement