‘స్పందన’తో ఉద్యోగాలు | - | Sakshi
Sakshi News home page

‘స్పందన’తో ఉద్యోగాలు

Jan 8 2024 11:24 PM | Updated on Jan 8 2024 11:24 PM

- - Sakshi

కాకినాడ సిటీ: కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం జరుగుతున్న స్పందన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న తొమ్మిది మందికి వికాస ద్వారా వివిధ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించారు. ఆయా సంస్థల్లో ఉద్యోగాలు పొందిన ఎం.సంధ్య, కె.సంకీర్తన, జి.సూర్య వెంకటేష్‌, బి.వీరేంద్ర, బి.జ్యోతి, హర్షిత, పి.ప్రశాంతి, కె.రెడ్డి సంధ్య, బి.ప్రియాంక సోమవారం స్పందన హాలులో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియను మర్యాదపూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ కె.శ్రీరమణి, వికాస ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.లచ్చారావు పాల్గొన్నారు.

జిల్లా చెస్‌ సంఘం అధ్యక్షునిగా శ్రీనివాసరావు

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): జిల్లా చెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షునిగా నాగం శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి సోమవారం ఉత్తర్వులు అందుకున్నారు. ఉపాధ్యక్షునిగా నల్లా శివరామకృష్ణ, కార్యదర్శిగా దివ్యతేజ నియమితులయ్యారు. ఉమ్మ డి తూర్పు గోదావరి జిల్లా స్థాయిలో కొనసాగుతున్న చెస్‌ అసోసియేషన్‌ ఇప్పుడు కాకినాడ జిల్లాకు ప్రత్యేకంగా ఏర్పడిందని ఈ సందర్భంగా శ్రీనివాసరావు తెలిపారు. గ్రామ స్థాయి నుంచి చెస్‌ క్రీడాభివృద్ధికి చర్యలు తీసుకుంటానని అన్నారు. జిల్లా నుంచి గ్రాండ్‌ మాస్టర్‌ హోదా కలిగిన క్రీడాకారులను తయారు చేసేందుకు వివిధ స్థాయిల్లో టోర్నమెంట్లు నిర్వహిస్తామన్నారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందిస్తామన్నారు. నూతన కార్యవర్గంలో 11 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు.

రేపు జాబ్‌మేళా

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): తమ కార్యాలయంలో బుధవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పన అధికారి జి.శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్యూజన్‌ మైక్రో ఫైనాన్స్‌, ఇంపాక్ట్‌ డయాగ్నస్టిక్స్‌, స్విగ్గీ సంస్థల్లో 366 ఉద్యోగాలకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయన్నారు. టెన్త్‌ నుంచి డిగ్రీ వరకూ విద్యార్హతలున్న వారు హాజరు కావచ్చని తెలిపారు. ఎంపికైన వారికి రూ.14 వేల నుంచి రూ.28 వేల వరకూ వేతనం చెల్లిస్తారన్నారు. వివరాలకు 0884–2373270 నంబరులో సంప్రదించాలని సూచించారు.

జిల్లా హాకీ జట్టు ఎంపిక

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): అంతర్‌ జిల్లాల హాకీ పోటీల్లో పాల్గొనే జిల్లా జూనియర్స్‌ బాలుర జట్టును జిల్లా క్రీడామైదానంలో సోమవారం ఎంపిక చేశారు. బాలుర విభాగంలో ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకూ తిరుపతిలో పోటీలు జరగనున్నాయి. జిల్లా హాకీ సంఘం ఆధ్వర్యాన ఎంపికై న జిల్లా జట్టులో 18 మంది స్థానం పొందారు. వారిని సంఘ కార్యదర్శి శ్రీనివాసరావు, కోచ్‌ రవిరాజు, నాగేంద్ర అభినందించారు.

తైక్వాండో కోశాధికారిగా అర్జునరావు

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): రాష్ట్ర తైక్వాండో సంఘ కోశాధికారిగా జిల్లా సంఘ కార్యదర్శి, కోచ్‌ బి.అర్జునరావు ఎన్నికయ్యారు. విశాఖలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. అర్జునరావును ఏపీ ఒలింపిక్‌ సంఘ సీఈఓ చుండ్రు గోవిందరాజు, జిల్లా ఒలింపిక్‌ సంఘ అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రరావు, కార్యదర్శి డాక్టర్‌ జి.ఎలీషాబాబు, డీఎస్‌డీఓ బి.శ్రీనివాస్‌కుమార్‌ సోమవారం అభినందించారు.

పోలీసు స్పందనకు 89 ఫిర్యాదులు

కాకినాడ క్రైం: స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పోలీసు స్పందన నిర్వహించారు. దీనికి మొత్తం 89 ఫిర్యాదులు అందాయని ఎస్పీ సతీష్‌కుమార్‌ తెలిపారు. సంబంధిత ఎస్‌హెచ్‌ఓలతో మాట్లాడి, సమస్యల తక్షణ పరిష్కారానికి ఆదేశాలిచ్చామని పేర్కొన్నారు.

ఫిర్యాదీల సమస్య తెలుసుకుంటున్న 
ఎస్పీ సతీష్‌కుమార్‌ 1
1/2

ఫిర్యాదీల సమస్య తెలుసుకుంటున్న ఎస్పీ సతీష్‌కుమార్‌

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement