
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాష ప్రాధాన్యం పెరిగింది. ఈ క్రమంలో ఇటువంటి స్పెల్‌బీ, మ్యాథ్‌బీ పరీక్షలు ఎంతో ఉపయోగకరం. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచి ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు ఈ పరీక్ష దోహదపడుతుంది. ఆంగ్లంలో మరింత పరిణితి సాధించడానికి వీలుంటుంది. ‘సాక్షి’ మ్యాథ్‌బీ పరీక్ష ద్వారా విద్యార్థులు రీజనింగ్‌లో ప్రతిభ కనబరుస్తున్నారు. గణితంలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గణితంపై విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుంది.
–బాలాత్రిపురసుందరి, డైరెక్టర్,
ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్, రాజమహేంద్రవరం
చాలా ఇంప్రూవ్ అయ్యింది
‘సాక్షి’ స్పెల్‌బీ పరీక్ష ద్వారా మా అమ్మాయి చాలా ఇంప్రూవ్ అయ్యింది. ఈ పరీక్ష రాయడం ద్వారా ఆంగ్ల భాషపై పూర్తి పట్టు వస్తుంది. దీంతో ఉన్నత చదువులకు బాట పడుతుంది. మా చిన్నతనంలో మాకు ఇటువంటి అవకాశాలు లేవు. ఇప్పుడు ‘సాక్షి’ యాజమాన్యం స్పెల్‌బీ, మ్యాథ్‌బీ నిర్వహించడం అభినందనీయం.
–బి.నివేదిత, శ్రీగౌతమీ స్కూల్
విద్యార్థిని తల్లి, రాజమహేంద్రవరం
ఇంగ్లిషులో ప్రావీణ్యం సాధించేందుకు..
‘సాక్షి’ స్పెల్‌బీ రాయడం ద్వారా ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం సాధించేందుకు అవకాశం ఏర్పడింది. కొత్తగా పదాలు తెలుసుకోవడంతో పాటు, సెంటన్స్ ఫార్మేషన్‌కు ఉపయోగపడింది. ప్రభుత్వ పాఠశాల నుంచి ‘సాక్షి’ స్పెల్‌బీ పరీక్ష తొలిసారిగా రాయడం చాలా ఆనందంగా ఉంది.
–ఎన్.నవదీప్,
ఏపీ మోడల్ స్కూల్, శంఖవరం

