అభివృద్ధి.. సంక్షేమమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి.. సంక్షేమమే లక్ష్యం

Sep 18 2026 1:51 AM | Updated on Sep 18 2026 1:51 AM

న్యూస్‌రీల్‌

జోగుళాంబ గద్వాల

శుక్రవారం శ్రీ 18 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

గద్వాల: రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా రంజక పాలన సాగిస్తుందని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, క్రీడల సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్‌ ఆవరణలో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పోలీసు గౌరవవందనం స్వీకరించి.. అనంతరం జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. వందేమాతరం గీతం ఆలపించిన తర్వాత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుందన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఆర్టీసీ బస్సులో ఆడపడుచులకు ఉచిత ప్రయాణ పథకంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు రూ.3.36 కోట్ల మంది ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నట్లు చెప్పారు. దీని ద్వారా రూ.129.03 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడంతోపాటు, పథకం కింద పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందిస్తున్నామని, జిల్లాలో ఇప్పటి వరకు 18,431 మందికి వివిధ రకాల వైద్యసేవలు అందించామని, ఇందుకోసం రూ.53.29 కోట్లు వెచ్చించామని పేర్కొన్నారు.

రాష్ట్రంలోనే మొదటిస్థానం..

జిల్లాలో 311 గ్రామ సంఘాల పరిధిలో 8,015 స్వయం సహాయక సంఘాలలో 85,633 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారన్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో 7,222 స్వయం సహాయక సంఘాలకు రూ.92.88 కోట్ల రుణాలు మంజూరు చేశామన్నారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అమలులో జోగుళాంబ జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచిందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 827 మంది లబ్ధిదారులకు రూ.1.65 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో మొదటి విడతలో జిల్లాకు రూ.4.68 కోట్లతో 13 బస్సులు కేటాయించడం జరిగిందన్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ నీటినిల్వ సామర్థ్యాన్ని 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించి, భూసేకరణకు అవసరమైన రూ.165 కోట్ల నిధులు విడుదల చేసిందన్నారు. గట్టు ఎత్తిపోతల పథకం సామర్థ్యం 1.3 నుంచి 3 టీఎంసీలకు పెంచి.. రూ.1,781 కోట్లతో ప్రాజెక్టు రీడిజైన్‌ అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. మల్లమ్మకుంట రిజర్వాయర్‌, వేగవంతం చేసి పూర్తి చేస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా హ్యామ్‌ రోడ్ల నిర్మాణానికి రూ.339.39 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. మెడికల్‌ కళాశాలలో అకడమిక్‌ బ్లాక్‌తోపాటు వసతి గృహాల నిర్మాణాలకు రూ.128 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే సర్‌ ప్రక్రియను పకడ్బందీగా వేగవంతంగా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అక్షరాస్యతలో ముందుకు తీసుకెళ్లే క్రమంలో జ్ణానదీప్తి పేరుతో వివిధ అంశాలపై ఉపాధ్యాయులందరికీ శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. తెలంగాణ రైజింగ్‌–2047 లక్ష్యంతో ముందుకు సాగుతుందన్నారు. అనంతరం వివిధ విద్యాసంస్థల చిన్నారులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రతిభచాటిన చిన్నారులకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌, ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే విజయుడు, కార్పొరేషన్‌ చైర్మన్లు సరిత, గట్టు తిమ్మప్ప, అదనపు కలెక్టర్లు మధుమోహన్‌, ఆర్డీఓ శ్రీనివాసరావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

జాతీయ పతాకానికి సెల్యూట్‌ చేస్తున్న

ఏపీ జితేందర్‌రెడ్డి, కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌, ఎస్పీ శ్రీనివాసరావు, కార్పొరేషన్‌ చైర్మన్లు

సరిత, గట్టు తిమ్మప్ప తదితరులు

అత్యవసరమైతే.. అవస్థలే!

మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రి ఐసీయూలో సరిపడా పడకలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

–8లో u

రైతులకు వెన్నుదన్ను..

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తోందని జితేందర్‌రెడ్డి చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల వ్యవధిలోనే జిల్లాలో 58,113 మంది రైతులకు రూ.513.99 కోట్ల పంట రుణమాఫీ చేశామన్నారు. రైతులకు పెట్టుబడి సాయంగా రైతుభరోసా పథకం కింద ఎకరాకు రూ.12 వేల చొప్పున జిల్లాలో 2026– 27 వానాకాలం సీజన్‌లో 1,72,417 మంది రైతులకు రూ.263 కోట్లు నేరుగా వారి ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు ద్వారా యాసంగి సీజన్‌లో 7,091 మంది రైతుల నుంచి 50,725 మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేసి రూ.121.18 కోట్లను నేరుగా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించి వివిధ పథకాల అమలులో ఉత్తమ పనితీరు కనబర్చి రాష్ట్రంలో 5వ స్థానం నిలిచామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement