ప్రతిఏటా తుంగభద్ర నదిలోనే నిమజ్జనం చేసేవాళ్లం. ఈసారి కూడా అక్కడే చేయాలనుకున్నాం. కానీ, తుంగభద్ర నదిలో నీరు లేదు. అక్కడక్కడ ఉన్న కొద్దిపాటి నీటిలో వినాయకుడిని వేసినా విగ్రహం కూడా మునిగిపోయే పరిస్థితి కనిపించడం లేదు. బీచుపల్లికి వెళ్లాలంటే అక్కడికి ఎక్కువ మొత్తంలో విగ్రహాలు నిమజ్జనంకు వచ్చే అవకాశం ఉంది. దీంతో మా సభ్యులు ఆలోచనలో పడ్డారు.
– అశోక్, శాంతినగర్
మేమే కరిగిస్తాం..
ఈసారి వర్షాభావ పరిస్థితుల కారణంగా, నదిలో నీరు లేదని గ్రహించాం. మీడియాలో వస్తున్న కథనాలు చూసి.. మట్టి గణపతిని తయారు చేసి, పూజలు నిర్వహించాం. ఈ గణపతినే ఒకచోట నీటితో కరిగించి, అందులో మొక్క నాటి, గ్రామంలో అందరికీ గణపతి నిమజ్జనం గుర్తుగా మొక్కను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. దీనివల్ల పర్యావరణ పరిరక్షణతోపాటు నిమజ్జనం ఇబ్బందులు తప్పుతాయి.
– జాని, అమరవాయి
ఏర్పాట్లు చేస్తున్నాం..
నిమజ్జనం సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. జిల్లాలో నిమజ్జనంకు కేటాయించిన ప్రదేశాల్లో ఏర్పాట్లు చేశాం. విగ్రహాలు ఎక్కువగా వచ్చినప్పటికీ.. ట్రాఫిక్ ఇతర ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో కొన్నిచోట్ల నీటి వనరులు ఉన్నాయి. వారు అక్కడే నిమజ్జనం చేసుకోవచ్చు. నిమజ్జనం చేసే సందర్భంలో తప్పనిసరిగా స్వీయ జాగ్రత్తలు కూడా చాలా అవసరం.
– శ్రీనివాసరావు, ఎస్పీ
●


