అర్హులందరికీ సంక్షేమాభివృద్ధి పథకాలు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ సంక్షేమాభివృద్ధి పథకాలు

May 23 2026 12:28 AM | Updated on May 23 2026 12:28 AM

గద్వాల: జిల్లాలో అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేయడమే కాకుండా ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాపాల న– ప్రగతి ప్రణాళిక కార్యక్ర మం దోహదపడుతుందని అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌ అ న్నారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల గురించి శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో ఎస్పీ శ్రీనివాసరావుతోపాటు అదనపు కలెక్టర్లు మధుమోహన్‌, నర్సింగ్‌రా వు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్ర స్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడమే కాకుండా ఇప్పటి వరకు ప్రభు త్వం అమలు చేసిన త్వరలో అమలు చేయబోయే సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నామని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రణాళికతో ముందుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయనే ఉద్దేశంతో ప్రభుత్వం వారోత్సవాలు నిర్వహించిందని చెప్పారు. ఆయా శాఖల్లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్ల క్లియరెన్స్‌, పరిశుభ్రత పనులు కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

● ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ మూడు నెలలు నిర్వహించిన ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలోనూ అరైవ్‌– అలైవ్‌లో ప్రజలకు రహదారి భద్రతపై అవగాహన కల్పించామన్నారు. ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది మరణించడమే కాకుండా గాయపడిన సురక్షితంగా ఇళ్లకు చేర్చుతున్నామన్నారు. డ్రగ్స్‌కు బానిసైన యువతకు కౌన్సిలింగ్‌ ఇచ్చి అవగాహన కల్పిస్తున్నామన్నారు.

● అదనపు కలెక్టర్‌ నర్సింగ్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం గృహజ్యోతి, రేషన్‌కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే ప్రభుత్వ హాస్టళ్లలో అల్పాహా రం, జూనియర్‌ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం గురించి వివరించారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా క్వింటాకు రూ.500 బోనస్‌ చెల్లిస్తున్నట్లు తెలిపారు. బాలభవ న్‌ విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జయలక్ష్మి, గ్రంథాలయ చైర్మన్‌ శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ శంకర్‌, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ప్రభావతమ్మ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement