ధరలు పెరగడం వల్లే.. | - | Sakshi
Sakshi News home page

ధరలు పెరగడం వల్లే..

May 23 2026 12:28 AM | Updated on May 23 2026 12:28 AM

ధరలు పెరగడం వల్లే.. ఆ ధర ఇప్పుడు లేదు పూర్తయ్యేలా చూస్తాం..

సిమెంట్‌తోపాటు ఇతర వస్తువుల ధరలు తగ్గించాలి. ధరలు పెరగడంతో ఇళ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది ఇళ్ల ప్రారంభానికి ముహూర్తాలు చేసుకొని ఆర్థిక పరిస్థితి లేక పనులు మొదలు పెట్టడం లేదు. ముడి సరుకులకు ధరలు పెంచడం వల్ల సామాన్యులపై ఆర్థిక భారం పడుతుంది.

– మహాలక్ష్మి, లబ్ధిదారురాలు, మానవపాడు

రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ధరల పరిస్థితి పెరుగుతుంది. సామగ్రితోపాటు రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. ఇసుక, సిమెంట్‌ ధరలు సైతం పెరిగిపోయాయి. మరోవైపు కూలీలకు డిమాండ్‌ చాలా ఉంది. ప్రభుత్వం పెరుగుతున్న ధరలను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలి.

– గాయత్రి, లబ్ధిదారురాలు, చెన్నిపాడు

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. ఈ మేరకు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులను ప్రోత్సహించేలా సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చాం. ఇక ధరల పెరుగుదల అనేది మా చేతుల్లో లేదు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలి.

– శ్రీనివాస్‌, గృహ నిర్మాణ శాఖ పీడీ

Advertisement
 
Advertisement
Advertisement