జడ్చర్ల: పట్టణంలో స్వైన్‌ఫ్లూ కేసు నమోదైంది. వారం రోజులుగా జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో జడ్చర్లకు చెందిన ఓ వ్యక్తి (42) జడ్చర్లలో ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాడు. జ్వరం, నిమోనియాకు సంబంధించి వైద్యచికిత్సలు అందించినా ఫలితం లేకపోవడంతో అనుమానంతో స్వైన్‌ఫ్లూ పరీక్షలు చేయించడంతో పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని జిల్లా వైద్యశాఖ అధికారులకు సమాచారం అందించారు. కాగా స్వైన్ ఫ్లూ వచ్చిన వ్యక్తి స్విమ్మింగ్‌ఫూల్‌లో ఈతకు వెళ్లిన వెంటనే జలుబు, జ్వరంతో అనారోగ్యానికి గురయినట్లుగా సమాచారం. మొదట జ్వరం కోసం చికిత్స తీసుకున్నా.. తగ్గకపోవడంతో పాటు శ్వాస సంబంధిత సమస్యలు రావడంతో పరీక్షలు చేయడంతో స్వైన్ ప్లూ నిర్ధారణ అయింది. ప్రజలు మాస్కులు ధరించడం, చేతులు శుభ్ర పరుచుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.


