రైతుల పాలిట శాపంగా భారత్‌మాల జాతీయ రహదారి | - | Sakshi
Sakshi News home page

రైతుల పాలిట శాపంగా భారత్‌మాల జాతీయ రహదారి

May 22 2026 12:42 AM | Updated on May 22 2026 12:42 AM

హైలెవల్‌ బ్రిడ్జి నిర్మించాలి.. పట్టించుకోవడం లేదు.. పొలాలకు వెళ్లలేకపోతున్నాం..

మా దృష్టికి వచ్చింది..

జిల్లాలో శరవేగంగా

6 వరుసల రోడ్డు పనులు

పంట పొలాలకు వెళ్లే అవకాశం

లేకపోవడంతో ఆందోళనలు

ఆరు మండలాల గుండా

సుమారు 53 కి.మీ., నిర్మాణం

775 ఎకరాలు కోల్పోయిన రైతులు

ప్రభుత్వం చేపట్టిన ఆరు వరుసల హైవే రోడ్డు నిర్మా ణం రైతుల పాలిట శాపంగా మారింది. రైతులు పొలాలకు వెళ్లేందుకు ఎద్దు ల బండ్ల రస్తా మూసుకుపోయింది. దీంతో రైతులు తమ పంట పొలాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడెక్కడ పంట పొలాలకు దారులు ఉన్నాయో ఆయా ప్రదేశాల్లో హైలెవల్‌ బ్రిడ్జిలు ఏర్పాటు చేసి, కింద పంట పొలాలకు దారి వదలాలి.

– రాఘవేంద్రగౌడ్‌, అయిజ

ఆరు వరుసల హైవే నిర్మా ణంలో రైతులు పంట పొలలకు ఏర్పాటు చేసుకున్న రోడ్లు మూసుకుపోతున్నా యి. దీంతో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా హై లెవల్‌ బ్రిడ్జి నిర్మించి హైవే నిర్మాణం పనులు పూర్తిచేయాలని అధికారులను కోరుతూ.. వినతిపత్రాలు అందజేసినా పట్టించుకోవడం లేదు.

– నాగిరెడ్డి,

రైతు సంఘం మండల అధ్యక్షుడు, అయిజ

భారత్‌మాల రోడ్డు నిర్మాణంలో రైతుల పంట పొ లాలకు వెళ్లే దారులు మూ సుకుపోయాయి. భారత్‌మాల హైవేలో అక్కడక్కడ ఏర్పాటు చేసిన దారిలోనే రైతులు వెళ్లాల్సి ఉంటుంది. దీనికోసం రెండు, మూడు కి.మీ., ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది. దీంతో చాలామంది రైతులం దిక్కుతోచని స్థితిలో పొలాలకు కూడా వెళ్లలేకపోతున్నాం.

– యువతేజేశ్వర్‌రెడ్డి, గుడుదొడ్డి

అయిజ: ‘చిన్న చేపను పెద్ద చేప.. పెద్ద చేపను సొర చేప మింగేసిన’ చందంగా తయారైంది.. భారత్‌మాల రోడ్డు పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఆరు వరుసల హైవే రోడ్డు రైతుల పంట పొలాలకు ఏర్పాటు చేసుకున్న మట్టి దారులు, గ్రామాల మధ్య రాకపోకలు సాగించే చిన్నపాటి రోడ్లను మూసివేసింది. పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు ఏర్పాటు చేసుకున్న ఎద్దుల బండ్ల రస్తాలు (బాటలు) సైతం రోడ్డు నిర్మాణంలో మూసుకుపోయాయి. మరోవైపు రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతుండడంతో రైతుల గుండెల్లో గుబులు మొదలైంది. రోడ్డు నిర్మాణం పూర్తయితే రైతులు తమ పంట పొలాలకు వెళ్లేందుకు కూడా అష్టకష్టాలు పడాల్సి వస్తుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే హైవే రోడ్డు నిర్మాణం పనులను రైతులు అనేకసార్లు అడ్డుకొని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా తహసీల్దార్‌ కార్యాలయాలు, కలెక్టరేట్‌లోనూ వినతిపత్రాలు అందజేసినా ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపానపోలేదు

ఆరు మండలాల మీదుగా..

జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఆరు మండలాల్లో భారత్‌మాల రోడ్డు నిర్మాణం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అయిజ, మల్దకల్‌, కేటీదొడ్డి, గట్టు, వడ్డేపల్లి, రాజోళి మండలాల మీదుగా 53 కి.మీ., దూరం హైవే రోడ్డు నిర్మాణం చేపట్టారు. రోడ్డు నిర్మాణంలో ప్రభుత్వం నుంచి 35 ఎకరాల భూమి, రైతుల నుంచి 775 ఎకరాల పంట పొలాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

భారత్‌మాల రోడ్డు నిర్మాణానికి గతంలోనే డిజైన్‌ చేశారు. రోడ్డు నిర్మాణం వలన వ్యవసాయ భూముల రోడ్లు మూసుకుపోయాయని గతంలో రైతులు అధికారులకు వినతిపత్రాలు అందజేస్తే.. రైతులు ఇచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు పీడీఎన్‌హెచ్‌ఐకు లేఖ రాశారు. ఇటీవల గట్టు మండలంలోని పాత ఆలూరు రోడ్డు సమస్య నా దృష్టికి వచ్చింది. రైతుల సమస్యలను కలెక్టర్‌కు తెలియజేస్తాను.

– శ్రీనివాసరావు, ఆర్డీఓ

Advertisement
 
Advertisement
Advertisement