ఆముదాలు క్వింటా రూ.6,111 | - | Sakshi
Sakshi News home page

ఆముదాలు క్వింటా రూ.6,111

May 21 2026 12:26 AM | Updated on May 21 2026 12:26 AM

గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు 6 క్వింటాళ్ల ఆముదా లు అమ్మకానికి రాగా..గరిష్టంగా రూ. 6,111, కనిష్టంగా రూ. 5,826, సరాసరి రూ. 5,826 ధరలు వచ్చాయి. అదే విధంగా 3 క్వింటాళ్ల వేరుశనగ రాగా..రూ. 6,869 ధర పలికింది. 295 క్వింటాళ్ల వరి (సోన) అమ్మకానికి రాగా..గరిష్టంగా రూ.2,389, కనిష్టంగా రూ. 1.890, సరాసరి రూ. 2,100 ధరలు లభించాయి.

పడిపోయిన ఉల్లి ధర

దేవరకద్ర: ఉల్లి ధరలు పడిపోయాయి. బుధవారం దేవరకద్ర మార్కెట్‌కు దాదాపు వెయ్యి బస్తాల ఉల్లి అమ్మకానికి రాగా అందులో సగం మంది రైతులు నేరుగా విక్రయించారు. మిగతా ఉల్లిని వేలం ద్వారా వ్యాపారులు కొనుగోలు చేశారు. దీంతో క్వింటా గరిష్టంగా రూ.1,500, కనిష్టంగా రూ.800 వరకు పలికింది. 50 కేజీల బస్తా ధర గరిష్టంగా రూ.750, కనిష్టంగా రూ.400 వరకు విక్రయించారు. బయట వ్యాపారులు రూ.650 నుంచి రూ.700 వరకు అమ్మకాలు సాగించారు.

Advertisement
 
Advertisement
Advertisement