గద్వాల: రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధా న్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసిన ట్లు అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. బుధ వారం గద్వాల మండలం చెనుగోనిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. గన్నీ బ్యాగుల్లో నింపిన ధాన్యాన్ని పరిశీలించారు. ప్రతి కేంద్రానికి నిర్ధిష్టంగా సమీపంలోని మిల్లులను కేటాయించి.. నిబంధనల ప్రకారం కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీల్లో తరలించాలని అధికారులకు సూచించారు. కేంద్రాల వారీగా అవసరం మేరకు గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచాలన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు, మిల్లులకు రవాణా, ఫోన్‌నంబర్లు తదితర వివరాలను తప్పనిసరిగా రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. రోజువారీగా కేంద్రంలో ధాన్యం నిల్వలు, తేమశాతం వచ్చిన పరిణామం, పంపిన లోడ్ల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే అధికారిక వాట్సప్ గ్రూప్‌ల ద్వారా తెలియజేసి సంబంధిత ఉన్నతాధికారుతో తక్షణ పరిష్కారం పొందాలని కేంద్రాల ఇన్‌చార్జీలు, అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యం అకాల వర్షాలకు తడవకుండా టార్ఫాలిన్లతో భద్రపర్చాలని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదనపు కలెక్టర్ వెంట సివిల్ సప్లయ్ డీఎస్‌ఓ స్వామికుమార్, ఏఈఓ ఉషశ్రీ తదితరులు ఉన్నారు.


