అవకాశాలను అందిపుచ్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

అవకాశాలను అందిపుచ్చుకోవాలి

May 21 2026 12:26 AM | Updated on May 21 2026 12:26 AM

గద్వాలన్యూటౌన్‌: నిరుద్యోగ యువతకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ జానకీరాం సాగర్‌ సూచించారు. గద్వాల మున్సిపాలీటీలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబందించి ఎస్సీ కార్పొరేషన్‌ కింద స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలో ఉదయం 10:30 నుంచి మద్యాహ్నం 2గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవీ టూ వీలర్‌ (గూడ్స్‌), ఈవీ త్రీ వీలర్‌ (ప్యాసింజర్‌), గేదెలు తదితర యూనిట్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాలను వివిధ బ్యాంకుల అధికారులతో కలిసి కమిషనర్‌ పరిశీలించారు. యూనిట్ల ద్వారా వారు నిర్వహించుకునే వ్యాపారాలు, వచ్చే ఆదాయం తదితర వివరాలను తెలుసుకున్నారు. మొత్తం 96 దరఖాస్తులు చేసుకోగా.. 62 మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో మెప్మా సిబ్బంది వెంకటేశ్వర్లు, తిమ్మన్న, నిజాముద్దీన్‌, మహాలక్ష్మి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement