కేటీదొడ్డి: మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే జిల్లా, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కుచినెర్లలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ఆయన భూమిపూజ చేసి మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభు త్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసి అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. ప్రతి మహిళ ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నూతన భవనాన్ని మహిళా సంఘాల సమావేశాల నిర్వహణకు వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతు, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయు డు, సర్పంచులు కృష్ణ, నారాయణ, నాయకులు వెంకటేశ్ నాయుడు, ఉరుకుందు, నర్సింహులు, హరిప్రసాద్, యుగంధర్ పాల్గొన్నారు.


