ఉత్సాహంగా క్రికెట్‌ ప్రాబబుల్స్‌ ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా క్రికెట్‌ ప్రాబబుల్స్‌ ఎంపికలు

May 20 2026 1:52 AM | Updated on May 20 2026 1:52 AM

గద్వాలన్యూటౌన్‌: జిల్లాకేంద్రంలోని స్టేడియంలో గద్వాల క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత క్రికెట్‌ కోచింగ్‌ నిర్వహిస్తున్నారు. ఔత్సాహిక క్రీడాకారుల వయసు, ప్రతిభ ఆధారంగా మంగళవారం పలు విభాగాల్లో ప్రాబబుల్స్‌ను ఎంపిక చేశారు. అండర్‌–12, 14, 16 కేటగిరీల నుంచి ఒక్కొక్క వి భాగంలో 25 మందిని ఎంపిక చేసినట్లు అసోసియేషన్‌ అధ్యక్షుడు శరత్‌కుమార్‌ తెలిపారు. ఎంపికై న క్రీడాకారులకు విడివిడిగా మ్యాచ్‌లు నిర్వహించి.. ఒక్కొక్క విభాగం నుంచి 18 మంది ప్రాబబుల్స్‌ను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. వీరిలో అత్యుత్తమ క్రీడాకారులను ఉమ్మడి జిల్లా జట్లకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ప్రతి కీడాకారుడికి మెళకువలు నేర్పించి.. ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ కార్యదర్శి శ్రీనివాసులు, కోచ్‌లు రిషి, ఖయ్యూం, సీనియర్‌ క్రీడాకారులు ఖలీం, రామకృష్ణ, హరినాథ్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement