గద్వాలన్యూటౌన్: జిల్లాకేంద్రమైన గద్వాల మున్సిపాలిటీలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు పుర కమిషనర్ జానకీరాం సాగర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఈవీ టూ వీలర్ (గూడ్స్), ఈవీ త్రీ వీలర్ (ప్యాసింజర్), గేదెలు తదితర యూనిట్ల కో సం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు సంయుక్త క్యాంపు (ఇంటర్వ్యూ) నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇండియన్ బ్యాంకు, టీజీబీ, ఎస్‌బీఐ, కెనరా, యూబీఐ, డీసీసీబీ, హెచ్‌డీఎఫ్‌సీ తదితర బ్యాంకులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సకాలంలో హాజరుకావాలని కమిషనర్ సూచించారు.
వేరుశనగ క్వింటా రూ.7,371
గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు మంగళవారం 35 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 7,371, కనిష్టంగా రూ. 6,769, సరాసరి రూ. 6,869 ధరలు లభించాయి. 9 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 6,109, కనిష్టంగా రూ. 6,011, సరాసరి రూ. 6,049 ధరలు పలికాయి. 372 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,436, కనిష్టంగా రూ. 1,870, సరాసరి రూ. 2,289 ధరలు లభించాయి.
జాతీయ అథ్లెటిక్స్
రెఫరీగా హైదర్ పాషా
ఎర్రవల్లి: బీచుపల్లి పదవ పటాలంలోని సాయిధ చైతన్య పాఠశాలలో వ్యా యామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సయ్యద్ హైద ర్ పాషా జాతీయ అథ్లెటిక్స్ రెఫరీ, రేస్‌వాక్ జడ్జి గా ఎంపికయ్యారు. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచిలో జరిగే 29వ నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ క్రీడలకు రిఫరీ, రేస్‌వాక్ జడ్జిగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అథ్లెటిక్స్ అసోషియేషన్ సభ్యు లు, వ్యాయామ ఉపాద్యాయులు, సాయుధ చైతన్య పాఠశాల ఉపాధ్యాయులు ఆయనకు అభినందనలు తెలిపారు.


