గద్వాల:స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–2026 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ సహకారం అందించాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ కోరారు. మంగళవారం ఐడీఓసీలోని తన చాంబర్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసిన షెడ్యూల్ ప్రకారం ఎస్‌ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు అందరి సహకారం ఎంతో అవసరమన్నారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, ఓటర్ల ధ్రువీకరణ వివరాల సవరణ, పోర్టల్‌లో అప్‌లోడ్ ప్రక్రియలను ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు సమయపాలనతో చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించి.. బీఎల్‌ఓలతో సమన్వయం చేసుకుని ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులను అదనపు కలెక్టర్ నివృత్తి చేశారు. అనంతరం బూత్ లెవెల్ ఏజెంట్ల నియామక ఫార్మట్లు పోలింగ్ కేంద్రాల వారీగా రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు. సమావేశంలో తహసీల్దార్ హరికృష్ణ, ఎన్నికల సూపరింటెండెంట్ మంజుల ఉన్నారు.


