గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు సోమవారం 76 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి రాగా.. గరిష్టంగా రూ. 8,541, కనిష్టంగా రూ. 4,419, స రాసరి రూ. 7,441 ధర పలికింది. 73 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 6,109, కనిష్టంగా రూ. 5,719, సరాసరి రూ. 6,039 ధర లు లభించాయి. 839 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,429, కనిష్టంగా రూ. 1,861, సరాసరి రూ. 2,179 ధర పలికింది.
అంతరాలు లేని
సమాజ స్థాపనే లక్ష్యం
నాగర్‌కర్నూల్ రూరల్: అంతరాలు లేని సమసమాజ స్థాపనే తెలంగాణ ప్రజా నాట్యమండలి లక్ష్యమని రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్‌నర్సింహ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ ప్రజా నాట్యమండలి జల్లా నాలుగో మహాసభలకు వారు హాజరై మాట్లాడారు. 1943లో పురుడు పోసుకున్న ప్రజా నాట్యమండలి.. దేశ స్వాంతంత్రోద్యమం నుంచి మొదలుకొని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, మలిదశ తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిందన్నారు. మూఢ నమ్మకాలు, వివక్షత, మతోన్మాదం, కులమతాలకు చరమగీతం పాడేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 25న హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్ర మహాసభలకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహ, గోపాల్, ప్రేమ్‌కుమార్, సలేశ్వరం, చందు, యాదగిరి, రామస్వామి, లింగేశ్వర్, శ్రీనివాస్, సురేశ్, కుర్మయ్య పాల్గొన్నారు.
హిందూ ధర్మాన్ని పాటిద్దాం
కందనూలు: హిందూ సమాజం సంస్కృతీ సంప్రదాయాలను పిల్లలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందని విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రాంనూతల శశిధర్ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని ఈదమ్మగుడి బస్తీలో ఏర్పాటుచేసిన హిందూ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో పురాతన కాలం నుంచి కొనసాగుతున్న సంస్కృతీ, సంప్రదాయాలను భావితరాల వారికి తెలియజేయడం అందరి బాధ్యతని అన్నారు. హిందూ సమాజంపై గౌరవభావం, ఏకాత్మకతా భావన, స్వధర్మంపై అంకితభావం, సేవాగుణం వంటి వాటిని వికసింపజేయాలని కోరారు. కార్యక్రమంలో ఓం భారత్ శక్తిపీఠం వ్యవస్థాపకులు భారతనంద మహారాజ్, ఉత్సవ సమితి అధ్యక్షుడు భానుప్రకాశ్, కార్యదర్శి రమేశ్, కౌన్సిలర్లు పాండు, కొత్త గంగాధర్ పాల్గొన్నారు.


