మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి ‘డిండి’ పేరుతో నల్లగొండ జిల్లాకు సాగునీరు తరలించొద్దని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఎకై ్సజ్, క్రీడల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీనికి ప్రత్యామ్నాయంగా నాగార్జునసాగర్–గొట్టిముక్కుల ఎత్తిపోతల ద్వారా ప్రతిపాదిత ప్రాజెక్టుకు అవసరమైన నీటిని తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు జి.రాజేందర్‌రెడ్డి, రాఘవాచారి, బెక్కం జనార్దన్, చెన్నకిష్టన్న, టి.జి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


