ప్రజా సంక్షేమానికి పెద్దపీట..
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల కోసం రూ.50 వేల కోట్లు కేటాయింపులు చేసింది. ఇందులో ప్రధానంగా పేదలకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్లు, ఆసరా పింఛన్లు, గృహజ్యోతి ఉచిత విద్యుత్, రైతుభరోసా, మహాలక్ష్మి, సన్నవడ్ల బోనస్ వంటి పథకాలకు పెద్దఎత్తున నిధులు కేటాయించారు. అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ ముందుకు వెళ్తున్నారు.
– బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల
ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అమలు సాధ్యం కాని ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత హామీలను పూర్తిగా విస్మరించి ప్రజలను నిలువునా మోసం చేసింది. అధికారంలోకి వచ్చిన అనంతరం ఒక్క హామీ పూర్తిగా నెరవేర్చలేదు. యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పింఛన్లు, కల్యాణలక్ష్మి, పేదలకు గృహ నిర్మాణ పథకం, రైతుభరోసా వంటి అనేక హామీలను తుంగలో తొక్కేశారు.
– రామాంజనేయులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు


