చాలా ఏళ్ల నుంచి మత్స్యశాఖ చేపల పెంపకంపై మాత్రమే దృష్టిపెడుతూ వస్తోంది. అయితే మార్కెట్‌లో రొయ్యలకు డిమాండ్ పెరగడంతో వాటి పెంపకంపై ఏడేళ్ల క్రితమే మత్స్యశాఖ దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా పైలెట్ ప్రాజెక్ట్‌గా 2019– 20లో జూరాల జలాశయంలో 6 లక్షల రొయ్యల సీడ్‌ను వదిలింది. అధికారులు, మత్స్యకారులు భావించినట్లుగానే రొయ్యల ఉత్పత్తి బాగా జరిగింది. దీనికి ప్రధాన కారణం రొయ్య బాగా పెరగడానికి జలాశయ అడుగు భాగంలో ఇసుక నేలలు ఉండటంతోపాటు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. దీంతో అప్పటి నుంచి మత్స్యశాఖ అధికారులు 2023– 24 వరకు ఏటా రొయ్యల సీడ్‌ను వదిలే సంఖ్య పెంచుతూ వచ్చారు.


