17, 18న యూనివర్సిటీల కన్వెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

17, 18న యూనివర్సిటీల కన్వెన్షన్‌

Mar 10 2026 7:25 AM | Updated on Mar 10 2026 7:25 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఈనెల 17, 18న పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించనున్న ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల కన్వెన్షన్‌ పోస్టర్‌ను పీయూ వీసీ శ్రీనివాస్‌ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ ఎస్‌ఎఫ్‌ఐ యూనివర్సిటీ కన్వెన్షన్‌కు పీయూ వేదిక కావడం గొప్ప విషయం అన్నారు. విద్యార్థులు, యూనివర్సిటీలకు మేలు జరిగే విధంగా చర్చలు జరుగుతాయని, విద్యార్థుల హక్కులు, అందరికీ నాణ్యమైన విద్య అందించేందుకు సంఘాలు కృషి చేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో పీయూ రిజిస్ట్రర్‌ రమేష్‌బాబు, ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడు జేపీఎన్‌సీ రవికుమార్‌, మధుసూదన్‌రెడ్డి, బెక్కం జనార్దన్‌, అధ్యక్ష, కార్యదర్శులు రాము, రాజేష్‌, భరత్‌, శేఖర్‌, సాయి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement