
పశు సంపదతోనేవ్యవసాయాభివృద్ధి
గద్వాల న్యూటౌన్: పశు సంపద తోడు ఉంటేనే వ్యవసాయం మరింత అభివృద్ధి చెందుతుందని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మండలంలోని అనంతాపురంలో కేఆర్‌ఐబీహెచ్‌సీఓ సంస్థ సహకారంతో నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. పశు సంపదతో రైతులకు ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందన్నారు. రైతులు పశువులకు సరైన పోషకాలు కలిగిన దాణా, మేత అందిస్తే పాల దిగుబడి పెరగడంతో పాటు వ్యవసాయంలో చేదోడుగా ఉంటాయని తెలిపారు. చూడి పశువులకు తప్పకుండా గాలికుంటు నివారణ టీకాలు చేయించాలన్నారు. శిబిరంలో భాగంగా 21 పశువులకు గర్భకోశ పరీక్షలు, చికిత్సలు నిర్వహించారు. అవసరమైన పశువులకు మందులు అందించడంతో పాటు, రాయితీ గడ్డి విత్తనాలు రైతులకు అందజేశారు. కార్యక్రమంలో కేఆర్‌ఐబీహెచ్‌సీఓ సంస్థ ప్రతినిధి రవికుమార్, గద్వాల మండల పశువైద్యాధికారి డాక్టర్ అర్పిత, డాక్టర్ పుష్పలత, డాక్టర్ మల్లేష్, డాక్టర్ హరిప్రియ, వెటర్నరీ అసిస్టెంట్ ప్రభాకర్, గోపాలమిత్రలు రామాంజనేయులు, ప్రభాకర్, పాడి రైతులు పాల్గొన్నారు.
మద్యం టెండర్ల
‘ఖాతా’ ప్రారంభం
● నాగర్‌కర్నూల్ జిల్లాలో మూడు టెండర్లు దాఖలు
● మిగిలిన జిల్లాల్లో నమోదు
కాని టెండర్లు
మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 227 మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించగా మంగళవారం నాగర్‌కర్నూల్ ఈఎస్ పరిధిలో మూడు టెండర్లు దాఖలయ్యాయి. నాగర్‌కర్నూల్‌లో సర్కిల్ పరిధిలో ఉన్న రెండు దుకాణాలకు, కల్వకుర్తిలో ఒక దుకాణానికి టెండర్లు వచ్చాయి. అయితే ఈనెల 26 నుంచి ఉమ్మడి జిల్లాలో ఉన్న మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఇప్పటి వరకు మూడు మాత్రమే వచ్చాయి. మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాలో ఇంకా ఖాతా ఒపెన్ కాలేదు. ఈనెల 18 వరకు టెండర్ల స్వీకరణకు గడువు ఉన్న క్రమంలో మద్యం వ్యాపారులు ఆలస్యం చేస్తున్నారు. చివరి వారం రోజుల్లో టెండర్ల వేగం పుంజుకుంటుంది. రెండేళ్ల కాలపరిమితిలో వచ్చే మద్యం వ్యాపారులకు స్థానిక ఎన్నికలతో పాటు మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు కలిసి రానున్నాయి. దీంతో గతం కంటే ఈసారి టెండర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
నది పరివాహక ప్రాంత రైతులను ఆదుకుంటాం
● రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి
కృష్ణా: వరదల కారణంగా కృష్ణా, భీమానది పరీవాహక ప్రాంతాల్లోని వరి పంటలకు అపార నష్టం వాటిల్లిందని.. ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం మండలంలోని వాసూనగర్, తంగిడి, కుసుమర్తి, సూకూర్ లింగంపల్లిలో పర్యటించి దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులు ఆందోళన చెందొద్దని, నష్టపోయిన రైతులను తాము అన్నివిధాలుగా ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఇప్పటికే అధిక వర్షాలతో పత్తి రైతులకు నష్టం వాటిల్లిందని, ఇప్పుడు వరదలతో వరి పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. రెవెన్యూ అధికారులు పంటనష్టంతో పాటు ఇతరాత్ర నష్టం వివరాలను పూర్తిస్థాయి నివేదిక అందించాలని ఆదేశించారు. తంగిడి, కుసుమర్తిలో తాగునీటి అవసరాలకు చేతిపంపులు మంజూరు చేశారు. కృష్ణాలో రోడ్డు నిర్మాణ పనులను త్వరలో చేపడతామని హామీ ఇచ్చారు. ఆయన వెనుక స్థానిక కాంగ్రెస్ నాయకులు సంతోష్ పాటిల్, సర్ఫరాజ్‌ఖాన్, విజప్పగౌడ, వీరేంద్రపాటిల్, నాగప్ప, మహదేవ్, మారెప్ప తదితరులు పాల్గొన్నారు.

పశు సంపదతోనేవ్యవసాయాభివృద్ధి

పశు సంపదతోనేవ్యవసాయాభివృద్ధి