
గడువు తక్కువ..లక్ష్యం ఎక్కువ
జిల్లాలో గద్వాల, అయిజ మున్సిపాలిటీలు పా తవి కాగా.. అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీ లు కొత్తగా ఏర్పడ్డాయి. అధికారులకు, సిబ్బందికి మధ్య సమన్వయం లేకపోవడం వలన ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి అధికారులు పన్నుల వసూళ్లపై అంతగా దృష్టి పెట్టలేదు. ఫలితంగా ఆర్థిక సంవత్సరం సగం ముగిసినా జిల్లాలోని మున్సిపాలిటీల్లో పావు వంతు పన్నులు కూడా వసూలు కాలేదు. గతేడాది ప్రభుత్వం ప్రకటించిన ఆస్తిపన్ను వడ్డీపై 90 శాతం రాయితీతో పాటు ఈ ఏడాది ఏప్రిల్‌లో ముందస్తు పన్ను చెల్లింపుదారులకు 5 శాతం రాయితీని కూడా కొంతమంది మాత్రమే వినియోగించుకున్నారు. ఈ పథకంపై అవగాహన కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇంతకాలం మిన్నకుండిన అధికారు లు గడువు సమీపిస్తుండటం, మరోవైపు ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఒత్తిడితో ఒక్కసారిగా మున్సిపల్ అధికారులు పన్ను వసూళ్లలో వేగం పెంచే పనిలో ఉన్నారు. సకాలంలో చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేయడమే కాకుండా నోటీసులు అందజేసేందుకు సన్నాహలు చేస్తున్నారు.
స్పెషల్ డ్రైవ్ చేపడతాం
ఆస్తిపన్నుతో పాటు బకాయిల వసూళ్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం. ఆ దిశగా చర్యలు చేపడుతున్నాం. పన్ను బకాయిదారులకు అవగాహన కల్పించాం. సిబ్బందికి లక్ష్యాలను నిర్దేశించి అనుకున్న పన్ను వసూళ్లను రాబడతాం. బకాయిదారులకు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటాం.
– జానకీరామ్, కమిషనర్,ఽ గద్వాల
●