
తొలగనున్న ఇబ్బందులు
సాదాబైనామా ఒప్పందాలు గ్రామీణ ప్రాంతాల్లో సర్వసాధారణం కాగా, రిజిస్ట్రేషన్ లేకపోవడం వలన వివాదాలు తలెత్తాయి. హైకోర్టు నిర్ణయంతో ఈ దరఖాస్తులు చట్టబద్ధంగా క్రమబద్దీకరించబడి, ఆస్తి యజమానులకు చట్టబద్దంగా హక్కులు లభించనున్నాయి. ఇది బ్యాంకు రుణాలు, ఆస్తి అమ్మకాలు, వారసత్వ హక్కుల విషయంలో ఇబ్బందులను తొలగిస్తుంది. – యువతేజేశ్వర్ రెడ్డి, గుడుదొడ్డి
ఆస్తి హక్కులపై భద్రత
హైకోర్టు గతంలో ఇచ్చిన స్టేను ఎత్తివేయడం హర్షించతగ్గ విషయం. గతంలో ఇచ్చిన స్టేను ఎత్తివేయడంతో జిల్లాలో 2వేలకు పైగా పెండింగ్ దరఖాస్తులను పరిష్కారం లభించనుంది. ఈ నిర్ణయంతో ప్రజలకు ఆస్తి హక్కులపై స్పష్టత, భద్రతను అందిస్తుంది.
– నజీర్, అయిజ
కీలక అడుగు
జిల్లా అధికారులు ఈపక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉంది. దరఖాస్తుదారులకు సరైన మార్గదర్శకాలు అందించి, అవకతవకలు లేకుండా ప్రక్రియను పూర్తి చేయాలి. ఈనిర్ణయం గ్రామీణ ప్రజలకు ఆర్థిక స్థిరత్వం, భద్రతను అందించే కీలక అడుగు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలను నివారించేందుకు చట్టబద్ధ రిజిస్ట్రేషన్‌ను ప్రోత్సహించాలి.
– సురేంద్ర స్వామి, సింధనూరు
ప్రభుత్వ ఆదేశాల మేరకు..
సాదాబైనామాలకు సంబంధించి 2014 జూన్ 2 లోపల కొనుగోలు అమ్మకం జరిగిన వ్యవహారానికి సంబంధించి, 2020 నవంబర్ 10 లోపల జిల్లాలో 2,392 దరఖాస్తులు ఉన్నాయి. అయితే వాటిని పరిశీలించేందుకు పూర్తి విధివిధానాలు ఇంకా ప్రభుత్వం ఇవ్వలేదు. గైడ్‌లైన్స్ అనుసరించి దరఖాస్తులను పరిశీలిస్తాం.
– లక్ష్మినారాయణ, అదనపు కలెక్టర్

తొలగనున్న ఇబ్బందులు

తొలగనున్న ఇబ్బందులు