
మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా వైద్య సేవలు
గద్వాల క్రైం: మహిళలు ఎదుర్కొంటుంన్న ఆరోగ్య సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యచరణ చేపట్టిందని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా ఆసుపత్రిలో స్వస్థ్ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ఈ నెల 17వ తేది నుంచి ఈక్టోబర్ 2వ తేది వరకు మహిళల ఆరోగ్య సమ్యసలపై ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నారన్నారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని స్వదినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ శిబిరంలో సీ్త్ర వ్యాధి, మానసిక, నేత్ర, చెవి, ముక్కు, దంత, చర్మ, పిల్లల వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారన్నారు. రక్తపోటు, షుగర్, నోటి, రొమ్ము, గర్భాశయ, క్యాన్సర్, టీబి తదితర రోగ నిర్ధారణ పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని మహిళలు శిబిరంలో పాల్గొనాలని, అన్ని రకాల వ్యాధులకు మందులు ఉచితంగా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం జిల్లా ఆసుపత్రిలోని రోగులకు అందుతున్న వైద్య సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ వైద్యాధికారి సిద్దప్ప, ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇందిర, అభినేష్, రాజు, ప్రసూన్నరాణి, సంధ్యాకిరణ్‌మై, శ్రీధర్‌గౌడ్, తదితరులు ఉన్నారు.
నేడు, రేపు డిగ్రీలోస్పాట్ అడ్మిషన్లు
శాంతినగర్: స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాలలో గురు, శుక్రవారాల్లో స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్. రామా ఓబులేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక, స్థానికేతర విద్యార్థులకు అడ్మిషన్ చేసుకునేందుకు అవకాశం వుందని తెలిపారు. అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్‌లతో ఈనెల 18, 19 తేదీల్లో కళాశాలలో హాజరుకావాలని సూచించారు.
పారదర్శక పాలనతోప్రజలకు మేలు
మహబూబ్‌నగర్ క్రైం: ప్రజా పాలన ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, పారదర్శక పరిపాలన ద్వారా ప్రజలకు ఎన్నో లాభా లు ఉంటాయని జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ అన్నారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా బుధవారం డీఐజీ కార్యాలయంలో డీఐజీ, అదేవిధంగా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డి.జానకి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది మరింత కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీలు ఎన్‌బీ రత్నం, సురేష్‌కుమార్, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, శ్రీనివాసులు, ఏఓ రుక్మిణిబాయి, సీఐలు అప్పయ్య, ఇజాజుద్దీన్, భగవంతురెడ్డి, శ్రీనివాస్, వెంకటేష్, ఆర్‌ఐలు నగేష్, కృష్ణయ్య పాల్గొన్నారు.

మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా వైద్య సేవలు