
మోదీ నాయకత్వంలోనే దేశాభివృద్ధి
గద్వాలటౌన్: ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామంజనేయులు, ప్రధాన కార్యదర్శి డీకే స్నిగ్దారెడ్డి పిలుపునిచ్చారు. మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సేవా సమర్పణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశా రు. బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరా న్ని వారు ప్రారంభించి మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలోనే దేశాభివృద్ధి సాధ్యమని చెప్పారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. భారతీయ ప్రాచీన సాంప్రదాయ వైద్య పద్దతుల గురించి ఈతరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. జన ఔషద సంస్థ ద్వారా పేద ప్రజలకు తక్కువ ధరకే మందులు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ఉచితంగా జనరిక్ మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకొని, సేవా దృక్పథంతో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.