
ఉపాధ్యాయుల్లేక.. విద్యకు దూరమవుతున్నాం
గద్వాల: పాఠాలు బోధించేందుకు ఉపాధ్యాయులు లేక విద్యకు దూరమవుతున్నామని.. ఇకనైనా స్పందించి ఉపాధ్యాయులను నియమించాలని గుర్రంగడ్డలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కలెక్టర్ సంతోష్‌ను కోరారు. ఈమేరకు సోమవారం కలెక్టర్‌ను కలిసేందుకు విద్యార్థులు గుర్రంగడ్డ నుంచి పడవలో గద్వాలకు చేరుకున్నారు. గత నెల 26న ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు పదోన్నతిపై మల్దకల్‌కు బదిలీ అయ్యారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు పాఠాలు చెప్పేవారు లేక విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని వారి తల్లిదండ్రులు తెలిపారు. పాఠశాలలో 35 మంది విద్యార్ధులు ఉన్నా బోధించేవారు తెరని వాపోయారు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ.. రెండురోజుల్లో ఉపాధ్యాయుడిని నియమిస్తామని, విద్యార్థులకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పడంతో వారు వెనుదిరిగారు.
పడవలో వచ్చి కలెక్టర్‌ను
కోరిన గుర్రంగడ్డ విద్యార్థులు

ఉపాధ్యాయుల్లేక.. విద్యకు దూరమవుతున్నాం