
ప్రతిరోజూ కాపలానే..
నేను 20 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నా. ప్రస్తుతం కాయలు కాసే దశ. ప్రతిరోజూ కాపలా ఉంటున్నా. ఇప్పుడే కాదు.. విత్తనాలు పెట్టిన నాటి నుంచి పత్తి చేతికొచ్చే వరకూ జింకలు రాకుండా ప్రతిరోజూ నాకు ఇదే పని. జింకలను ఇక్కడి నుంచి అటవీ ప్రాంతానికి తరలిస్తేనే మా సమస్య తీరుతుంది. అధికారులు ఇప్పటికై నా పటిష్ట చర్యలు తీసుకోవాలి. – బస్లింగప్ప, చేగుంట,
కృష్ణా మండలం, నారాయణపేట జిల్లా
ఎన్ని ప్రయత్నాలు చేసినా..
మా కుటుంబానికి దాదాపు 30 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ప్రతిఏటా పత్తి వేస్తున్నాం. జింకల వల్ల విత్తనాలను మళ్లీ మళ్లీ నాటడం ఆనవాయితీగా మారింది. కాయలు పడుతున్నప్పుడు గుంపులుగా దాడి చేసి తింటున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అవి చేనులోకే వస్తున్నాయి. జింకలను పట్టి పరిరక్షణ కేంద్రాలకు తరలించాలి.
– అంపయ్య, గుడేబల్లూరు,
కృష్ణా మండలం, నారాయణపేట జిల్లా
●

ప్రతిరోజూ కాపలానే..