
ఎట్టకేలకు ముందడుగు..
కృష్ణ జింకల రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు దిశగా ముడుమాల్ వద్ద 74.10 ఎకరాల భూమి హద్దులను రెవెన్యూ అధికారులు గుర్తించి మార్కింగ్ చేశారు. ఇటీవల ఆ భూమిని అటవీ శాఖకు అప్పగిస్తూ ఆర్డర్లు సైతం జారీ అయ్యాయి. దీంతో అటవీ శాఖ ఎట్టకేలకు రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు పనుల కోసం టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతోంది. చెరువు పరిధిలోకి రాని సుమారు 44 ఎకరాల్లో శాశ్వత, చెరువు పరిధిలోకి వచ్చే 30 ఎకరాల్లో తాత్కాలికంగా పనులు చేపట్టేలా అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికై నా ఎలాంటి జాప్యం లేకుండా చూసి.. జింకల సమస్య తీర్చాలని రైతులు వేడుకుంటున్నారు.