
సాక్ష్యాధారాల సేకరణ వేగవంతం : ఎస్పీ
గద్వాల క్రైం: నేరం జరిగిన ప్రాంతాల్లో సమర్థవంతంగా, వేగవంతంగా సాక్ష్యాధారాలు సేకరించేందుకు వీలుగా ప్రభుత్వం జిల్లాకు మొబైల్ ఫోరెన్సిక్ వాహనం కేటాయించిందని ఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. మంగళవారం మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నేరం జరిగిన ప్రదేశంలో వేలి, కాలిముద్రలు, నార్కొటిక్, పేలుడు పదార్థాలు ఇతర అన్నిరకాల ఆధారాలను విచారణ అధికారులు మరింత వేగంగా, అత్యాధునిక పద్ధతుల్లో సేకరించేందుకు మొబైల్ ఫోరెన్సిక్ వాహనం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ వాహనంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బంది విధుల్లో ఉంటారన్నారు. ఘటనా స్థలాల్లో లభించే ఆధారాలను ఎప్పటికప్పుడు అనాలసిస్ చేయడానికి దోహ ద పడుతుందన్నారు. వాహనానికి ప్రత్యేక కెమెరా, ఫ్రిడ్జ్, మోడ్రన్ లైట్లు, డిజిటల్ పరికరాలు తదితర సాంకేతిక పరమైన టూల్స్ అందుబాటులో ఉన్నా యని తెలిపారు. విపత్కర కేసుల ఛేదనలో మొబైల్ ఫోరెన్సిక్ వాహనం కీలకంగా ఉంటుందన్నారు. కా ర్యక్రమంలో డీఎస్పీ మొగిలయ్య పాల్గొన్నారు.