
గట్టులో యూనిసెఫ్ బృందం పర్యటన
గద్వాల/గట్టు: గ్రామీణ ప్రాంతంలోని చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషక లోపాన్ని నివారించేందుకు చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు గాను మంగళవారం యూనిసెఫ్ బృందం గట్టులో పర్యటించింది. యూనిసెఫ్ ఇండి యా న్యూట్రీషన్ చీఫ్ మారీక్లాడ్, స్పెషలిస్టు సమీర్ మాణిక్‌రావు పవార్, హైదరాబాద్ ఫీల్డ్, న్యూట్రీషన్ స్పెషలిస్టు ఖ్యాతి తివారీ, ఎస్‌బీసీ సీమాకురమార్, న్యూట్రీషన్ ఆఫీసర్ రేషా దేశాయ్, కన్సల్టెంట్ నర్సింగరావు, డీడబ్ల్యూఓ సునంద తదితరులతో కూడిన బృందం గట్టు సంతబజారు అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అంగన్‌వాడీ కేంద్రం పరిధిలో పోషణలోపం, అతి తీవ్ర పోషణలోపం పిల్లల గుర్తింపు.. తల్లిదండ్రులు తీసుకుంటున్న జాగ్రత్తలపై ఆరా తీశారు. గర్భిణులు, బాలింతలకు అంగన్‌వాడీ ద్వారా అందిస్తున్న సేవలతో పాటు రోజు వారీగా తీసుకునే ఆహారం తదితర వివరాలను తెలుసుకున్నారు. మహిళా సంఘాలు నిర్వహిస్తున్న వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు. అనంతరం నేతాజీ చౌక్‌లో ఆరోగ్య ఉపకేంద్రాన్ని పరిశీలించారు. వారి వెంట ఎస్‌బీసీసీ కోఆర్డినేటర్ శృతి అప్పింగికర్, ఏఐఐఎస్ ప్రాజెక్టు శాస్త్రవేత్త శిరీష, సురేశ్, హరినీలేష్, జశ్వంత్‌నాయుడు, ఎంపీడీఓ చెన్నయ్య ఉన్నారు.
● చిన్నారుల సంక్షేమంపై యూనిసెఫ్ బృందం సూచనలు పాటిస్తామని కలెక్టర్ బీఎం సంతోష్ అ న్నారు. ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌లో యూనిసెఫ్ బృందంతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా యూనిసెఫ్ బృందం పలు సూచనలు చేసింది. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, డీఎంహెచ్‌ఓ డా.సిద్ధప్ప, జిల్లా సంక్షేమశాఖ అధికారిణి సునంద, డీపీఓ నాగేంద్రం ఉన్నారు.